29.7 C
Hyderabad
May 3, 2024 04: 46 AM
ముఖ్యంశాలు

రఘురామ లాకప్ హింసపై మళ్లీ ఏపి ప్రభుత్వానికి నోటీసులు

#raghurama

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు ను పోలీసు లాకప్ లో చిత్ర హింసలకు గురిచేసినట్లు వచ్చిన ఆరోపణలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోసారి నోటీసులు జారీ చేసింది.

రఘురామకృష్ణంరాజును ఏపి సిఐడి పోలీసులు అరెస్టు చేసి కష్టడీలో హింసించినట్లు జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి స్పందన తెలపలేదు.

దాంతో ఎంపీ రఘురామ అంశంలో ఏపీ హోం శాఖ కార్యదర్శి డిజిపి కి జాతీయ మానవ హక్కుల కమిషన్ మరోసారి సమన్లు జారీ చేసింది.

ఆగస్టు 9 లోపు నివేదిక ఇవ్వాలని తాజాగా ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు ఇచ్చింది. గడువులోగా నివేదిక ఇవ్వకపోతే ఆగస్టు 16న వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుందని ఆదేశం జారీ చేసింది.

Related posts

గోదావరి వరద పై పువ్వాడ ఉన్నతాధికారులతో సమీక్ష

Bhavani

విజన్ డాక్యుమెంట్: స్థానిక సంస్థలకు అధికారాలేవి?

Satyam NEWS

చంద్రబాబు నాయుడు అరెస్ట్

Satyam NEWS

Leave a Comment