31.7 C
Hyderabad
May 2, 2024 09: 59 AM
Slider ముఖ్యంశాలు

మళ్ళీ వర్షాలు |

#cyclone

బంగాళాఖాతం లో ఏర్పడిన  ఉపరితల ఆవర్తనం కారణంగా రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రానున్న 24 గంటల్లో అల్పపీడనం బలపడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 22వ తేదీ నాటికి ఇది మరింత బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ వెల్లడించింది. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వర్షాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడిప్పుడే వర్షాల నుంచి తేరుకుంటున్న సమయంలో మళ్లీ రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ విభాగం తెలిపింది. అండమాన్ సముద్ర తీరం ఆ పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని.. రాగల 24 గంటల్లో ఇది అల్పపీడనంగా బలపడే సూచనలున్నాయని వాతావరణ విభాగం వెల్లడించింది. ఈ నెల 22వ తేదీ నాటికి ఇది మరితం బలపడి వాయుగుండంగా మారుతుందని ఐఎండీ తెలిపింది. అనంతరం తుపానుగా బలపడేందుకు అవకాశాలు ఉన్నాయని వాతావరణ విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం అండమాన్ సముద్రం నుంచి తమిళనాడు వరకూ కోస్తా తీరంపై ఆవరించిన ఉపరితల ద్రోణి ప్రభావంతో చాలాచోట్ల మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది.

Related posts

బయట నుంచి వచ్చిన వారికి స్వీయ నిర్భందం తప్పని సరి

Satyam NEWS

ప్రకాశం జిల్లా స్కూళ్లలో 17 కరోనా పాజిటివ్ కేసులు

Satyam NEWS

జోబైడెన్ ప్రతిపాదనకు నో చెప్పిన సెనేటర్

Satyam NEWS

Leave a Comment