29.7 C
Hyderabad
May 3, 2024 03: 31 AM
Slider ప్రకాశం

ప్రకాశం జిల్లా స్కూళ్లలో 17 కరోనా పాజిటివ్ కేసులు

#prakashamdist

ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు నమోదు కావటం ఆందోళనకు కలిగిస్తోంది. కోవిడ్ కేసులు పెరుగుతున్న క్రమంలో తెలంగాణలో జనవరి చివరి వరకు సెలవులు ప్రకటించింది ప్రభుత్వం. కానీ ఏపీలో మాత్రం పండుగ తరువాత కూడా స్కూల్స్ ఓపెన్ అయ్యాయి. దీంతో ఏపీలోని ప్రభుత్వ, ఎయిడెడ్‌ పాఠశాలల్లో కరోనా కేసులు కలవరపెడుతున్నాయి. ప్రకాశం జిల్లాలో ఒకే రోజు స్కూళ్లలో 17 పాజిటివ్‌ కేసులు వెలుగు చూడడం ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లాలో మంగళవారం (జనవరి 18) ఒక్కరోజే 17 మంది సిబ్బందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. కోవిడ్ సోకినవారిలో 15 మంది ఉపాధ్యాయులతో పాటు ఇద్దరు సిబ్బందికి కోవిడ్‌ సోకింది.

ఒంగోలు డీఆర్ఎం, ప్రభుత్వ బాలికోన్నత పాఠశాల, అద్దంకి మండలం తిమ్మాయపాలెం, చిన్నగంజాం జెడ్పీ హైస్కూల్‌లో ఇద్దరికి కరోనా సోకింది. ఒంగోలు కేంద్రీయ విద్యాలయ, మార్కాపురం శారదా ఎయిడెడ్ స్కూల్, కనిగిరి నందన మారెళ్ల, సింగరాయకొండ మండలం కలికివాయి, టంగుటూరు మండలం కొణిజేడు, పంగులూరు మండలం రేణిగంవరం, సంతమాగులూరు మండలం పుట్టావారిపాలెం, యద్దనపూడి మండలం యనమదల, గన్నవరం ఎంపీపీఎస్ స్కూళ్లలో ఒక్కక్కరికి టీచర్లకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. త్రిపురాంతకం మండలం మేడపి, యద్దనపూడి మండలం పూనూరు స్కూళ్లలో బోధనేతర సిబ్బందికి కోవిడ్‌ సోకింది.

Related posts

రాంకీ సంస్థ నిర్వాకంతో రైతన్నల గగ్గోలు

Satyam NEWS

ఈ గుండూ బాస్ ఎవరో గుర్తు పట్టగలరా?

Satyam NEWS

బాధిత కుటుంబానికి చేయూతనందించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

Leave a Comment