40.2 C
Hyderabad
May 2, 2024 17: 33 PM
Slider నల్గొండ

మూడు వ్యవసాయ చుట్టాలను రద్దు చేయాల్సిందే

#Roshapathi

దేశ రాజధాని ఢిల్లీ నగరంలో అలుపెరగని రైతుల పోరాటానికి ఎర్రెరని విప్లవ వందనాలు తెలియజేస్తూ రైతులకు మద్దతుగా ఇందిరాపార్క్ ధర్నాలో సూర్యాపేట జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి పాల్గొన్నారు. చలో హైదరాబాద్ ఇందిరాపార్క్ నందు హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం నుండి పలువురు కార్మికులు పాల్గొన్నారు.

 అనంతరం వారితో కలిసి ఇందిరా పార్క్ ధర్నాలో పాల్గొన్న రోషపతి మాట్లాడుతూ కార్మికుల పోరాడి సాధించుకున్న హక్కులని నాలుగు కోడులుగా చేయటం, కొత్త చట్టాలని రద్దు చేయాలని, రైతు వ్యవసాయ మూడు చట్టాలు కూడా రద్దు చేయాలని అన్నారు. రైతులతో చర్చల్లో పాల్గొని సమస్యలు పరిష్కరించకుండా చర్చలకే పరిమితం కావడం సరైంది కాదని అన్నారు.

లక్షలాది మంది గత 35 రోజుల నుంచి ఎముకలు కొరికే చలిలో ఆందోళన చేస్తుంటే ప్రజా సమస్యలు పట్టించుకోని ప్రధాని మోడీ ప్రపంచంలో మరొకరు లేరని  విమర్శించారు. సిఐటియు సూర్యాపేట జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎలక సోమయ్య గౌడ్ మాట్లాడుతూ రైతులు ఢిల్లీలో అందోళన చేస్తుంటే ప్రధాని మోదీ ఏమీ పట్టనట్టుగా ఉండటం ప్రజలందరూ గమనిస్తున్నారని, దీనికి మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రం నుండి వెళ్ళిన వారిలో వెంకన్న, సైదులు, నరేష్, వీరస్వామి, అబ్దుల్, రాజు, లక్ష్మణ్, తదితర కార్మికులు పాల్గొన్నారు.

Related posts

పంట పొలాలు నాశనం చేస్తున్న ఏనుగుల దండు

Satyam NEWS

భవానీపుర్‌ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమత ఘన విజయం

Satyam NEWS

కాంట్రాక్టర్ చేతివాటంపై నిధుల ఆడిట్ జరగాలి

Satyam NEWS

Leave a Comment