39.2 C
Hyderabad
April 28, 2024 14: 16 PM
Slider నల్గొండ

విజయవంతంగా 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న AITUC

#AITUC

ఎ ఐ టి యు సి శతజయంతి ఉత్సవాలలో భాగంగా శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని AITUC కార్యాలయంలో జెండా పండుగ నిర్వహించారు.

ఈ సందర్భంగా జడ శ్రీనివాస్ మాట్లాడుతూ 31.10.1920 వ, సంవత్సరంలో  భారతదేశంలో నాడు అతికొద్ది మందితో ఏర్పడిన సంఘం అయినప్పటికీ నాటినుండి నేటి వరకు కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా పోరాటాలు నిర్వహిస్తూ కార్మికుల అనేక హక్కులు సాధించిన ఘన చరిత్ర  ఎ ఐ టి యు సి  కి ఉంది అని అన్నారు.

అట్లే భారతదేశం పరాయి పాలన నుండి విముక్తి కోసం చేసిన పోరాటాలలో ముందడుగు వేసిన తొలి సంఘం ఎ ఐ టి యు సి అన్నారు.జవహర్ లాల్ నెహ్రూ, బాలగంగాధర్ తిలక్, సుభాష్ చంద్రబోస్, వి.వి.గిరి, ఎస్ ఏ డాంగే, ఇంద్రజిత్ గుప్తా మున్నగు నాయకుల నాయకత్వంలో అలుపెరుగని పోరాటాలు చేసి ఎన్నో హక్కులను సాధించుకున్న ఘనచరిత్ర AITUC కి ఉంది అన్నారు.

ఈ కార్యక్రమంలో CPI  పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యుడు పాలకూరి బాబు, ఏ ఐ టి యు సి గౌరవ అధ్యక్షుడు ఇందిరా వెంకటేశ్వర్లు, జిల్లా కౌన్సిల్ నాయకుడు కంబాల శ్రీను,పట్టణ సిపిఐ కార్యదర్శి గుండు వెంకటేశ్వర్లు,మార్కెట్ యార్డ్ హమాలీ వర్కర్స్ అధ్యక్షుడు కొత్త పల్లి లక్ష్మయ్య,NSP ఎంప్లాయిస్ యూనియన్ నాయకుడు కొట్టు శ్రీనివాస్,

ప్రైవేట్ ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు ములకలపల్లి రాంబాబు, శ్రీనివాస్, బిల్లింగ్ వర్కర్స్ యూనియన్ నాయకుడు జెట్టి రాములు, జెట్టి ప్రసాద్, హమాలి వర్కర్స్ యూనియన్ నాయకుడు లింగం ధనమూర్తి, పెయింటర్స్ వర్కర్స్ యూనియన్ నాయకుడు నాగేశ్వరరావు, సామిల్ వర్కర్స్ యూనియన్ నాయకుడు వెంకటేశ్వర్లు, కమలాకర్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

(Professional) Diabetes Latest Drugs Reduce High Blood Sugar Fast Diabetes Meds Side Effects

Bhavani

కరోనా ప్రోటోకాల్స్ పాటిస్తూ స్వాతంత్య్ర వేడుక‌లు

Satyam NEWS

ప్రత్యేక హోదా ఇస్తేనే బిహార్‌లో అభివృద్ధి

Bhavani

Leave a Comment