42.2 C
Hyderabad
April 30, 2024 15: 23 PM
Slider కడప

పురాతన భవనం కూలిపోయి ఒకరు మృతి

#HouseColapse

కడప జిల్లా రాయచోటి పట్టణంలోని ఠానా సర్కిల్  సమీపాన తెల్లవారుజామున ఆరు గంటలకు పురాతన మూడు అంతస్థుల భవనం కూలిపోవడంతో అందులో ఉన్న ముగ్గురిలో ఒకరు చనిపోయారు.

మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు జెసిపి సహాయం తో శిధిలాలను తొలగించి గాయపడ్డి ముగ్గురిని రాయచోటి ఏరియా ప్రభుత్వ హస్పిటల్ కు తరలించారు.

అప్పటికే కుటుంబ యజమాని అస్రఫ్ అలీ ఖాన్ (60) సంవత్సరాలు మృతి చెందినట్లు డాక్టర్లు నిర్దారించారు. తీవ్ర గాయాలు అయినా ముష్రఫ్ అలీని మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు.

మృతి చెందిన అస్రఫ్ అలీఖాన్ కూలీడ్రింక్ షాపు పెట్టుకుని జీవనం సాగించేవాడు. రోడ్ విస్తరణ లో డ్రైనేజి కాలువ పని చేస్తుడగా అస్రఫ్ అలీ ఇల్లు ఇటీవల కొంత భాగాన్ని జె సి బి తో తొలగించారు.

దాని వల్ల ఇల్లు కూలిపోయిందని స్థానికులు తెలిపారు.

Related posts

తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ ఫోరం మహా సంకల్ప దీక్ష

Satyam NEWS

విజ‌య‌న‌గ‌రం పోలీసుల అదుపులో సెంచ‌రీ దొంగ‌@114 థెప్ట్స్..!

Satyam NEWS

చోరీ కేసు గంటల వ్యవధిలో ఛేదించిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment