29.7 C
Hyderabad
May 7, 2024 04: 29 AM
Slider వరంగల్

31న జరిగే ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాలను జయప్రదం చేయండి

#aituc

1920 అక్టోబర్ 31వ తేదీన ఆవిర్భవించిన ఏఐటీయూసీ నూట ఒక్క సంవత్సరాలు పూర్తిచేసుకుని 102 వ సంవత్సరంలోకి కి అడుగుతున్న సందర్భంలో కార్మిక వర్గం ప్రతి గ్రామంలో ఏఐటీయూసీ జెండాలను ఆవిష్కరించాలని ఏఐటీయూసీ ములుగుజిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల రవీందర్ కోరారు. నేడు ములుగులో ఏ ఐ టి యు సి మండల సమితి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ ఐ టి యు సి, ఆవిర్భవించింది కార్మిక వర్గం కష్టాల నుండి విముక్తి కల్పించడానికి అన్నారు.

నాటి నుండి నేటి వరకు అనేక చట్టాలను సాధించి కార్మిక వర్గానికి ఎనిమిది గంటల పని దినం, పని భద్రత, వేతనాల పెంపు, అనేక అంశాలను సాధించడం జరిగింది అన్నారు. కానీ ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర, ప్రభుత్వాలు కార్మికులు పోరాడి సాధించుకున్న అనేక చట్టాలను తొలగించి, కార్పొరేట్ అనుకూల చట్టాలను తయారు చేస్తున్నారని ఆయన అన్నారు.

ఇప్పటికే 44 చట్టాలను కుదించి, నాలుగు కోడ్స్ గా మార్చారని అన్నారు. మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ రంగం పూర్తిగా లేకుండా చేయడం కోసం పనిగా పడ్డారని, చెప్పేది ఏమో పేదల కోసమే అంటున్నారు, కానీ చేసేది మాత్రం పెట్టుబడిదారుల కోసమే అని ఆయన అన్నారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏమో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, విధానం అనేది అసలే నాకు నచ్చదు అని తెలంగాణ ఉద్యమంలో, ఎన్నికల ముందు అనేక సందర్భాల్లో ప్రకటించడం జరిగింది,

కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చి ప్రభుత్వం కూడా అదే వచ్చిన తర్వాత, అదే కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ విధానాన్ని మరింత దూకుడుగా పెంచడం జరిగింది అన్నారు. అందుకే కార్మిక వర్గం ఒక్కసారి ఆలోచించి ప్రభుత్వ రంగాన్ని రక్షించుకోవడానికి ప్రతి ఉద్యోగి పర్మినెంట్ ఉద్యోగి గా మారడానికి సమరశీల ఉద్యమాలు నిర్వహించాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ సమావేశంలో ముత్యాల రాజు, జక్కుల ఐలయ్య, మొలుగూరి రాంబాబు, తనుగుల రాజు, మిర్యాల రవి, రాములు, యాటల పైడి, జక్కుల రాజ్కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమ్మ భాష కమ్మదనం

Satyam NEWS

ఏ మాత్రం అవగాహనలేని సీఎం ఈ జగన్ రెడ్డి

Satyam NEWS

గ్లామర్ ప్రపంచానికి టోనీ అండ్ గై ఎస్సెన్షియల్స్

Satyam NEWS

Leave a Comment