37.2 C
Hyderabad
May 2, 2024 13: 45 PM
Slider గుంటూరు

విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై ఏఐటియుసి నిరసన

#aituc

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఏ ఐ టి యు సి రాష్ట్ర సమితి పిలుపు మేరకు పల్నాడు జిల్లా నరసరావుపేటలో నిరసన తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏ ఐ టి యు సి పల్నాడు జిల్లా కన్వీనర్ కాసా రాంబాబు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం దొంద వైఖరిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఒక మాట బయట ఒక మాట చెబుతున్నదని, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మటాన్ని ఏఐటియుసి తీవ్రంగా ఖండిస్తుందని ఆయన అన్నారు.

ఆంధ్ర రాష్ట్రంలో ఒకే ఒక్క భారీ పరిశ్రమ విశాఖ స్టీల్ ప్లాంట్ అని ఐదు కోట్ల ఆంధ్ర ప్రజల ఆశాజ్యోతి అని అలాంటి స్టీల్ ప్లాంట్ ని అమ్మడాన్ని మానుకోవాలని డిమాండ్ చేశారు. 32 మంది యువకుల బలిదానంతో ఏర్పడిన స్టీల్ ప్లాంట్ అని, ఆంధ్రుల ఆత్మగౌరవం అని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా కార్మిక విధానాలపైన ఏఐటియుసి  పోరాటం నిర్వహిస్తుందని మిగతా కార్మిక సంఘాల్లో కలుపుకొని విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందామని పోరాటాన్ని మరింత ఉధృతం చేద్దామని ఆయన అన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు భూధాల శ్రీనివాసరావు ఎఐటిసి అధ్యక్ష కార్యదర్శులు ఉప్పలపాటి రంగయ్య వైదన వెంకట్ ఏఐటియుసిజిల్లా నాయకులు వందనం మళ్ళీ పిన్నబోయిన రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నీటి అన్యాయంపై నోరు మెదపని మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి

Satyam NEWS

చలికాలం మరింత ఉధృతంగా రాబోతున్న కరోనా

Satyam NEWS

హైదరాబాద్ ప్రజల విశ్వాసం చూరగొన్న బిజెపి రధ సారధి

Satyam NEWS

Leave a Comment