42.2 C
Hyderabad
May 3, 2024 17: 29 PM
Slider రంగారెడ్డి

ఘనంగా కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్ అధ్యక్షుడి జన్మదినం

#somasekhar

కాంగ్రెస్ పార్టీ ఉప్పల్ బి బ్లాక్అధ్యక్షులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా వందలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, అభిమానులు, వివిధ కాలనీ సంక్షేమ సంఘాల నాయకులు, పాత్రికేయులు కుషాయిగూడ లోని ఆయన కార్యాలయంలో కలిసి ఘనంగా సన్మానించి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గజమాలతో సత్కరించారు. ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, కాప్రా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు శనిగరం అశోక్, టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షుడు మెరుగు చంద్రమోహన్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు యావాపురం రవి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గుమ్మడి హరిప్రసాద్, జిల్లా సంయుక్త కార్యదర్శి జి. రోజారాణి, ప్రెస్ క్లబ్ సంయుక్త కార్యదర్శి ఆంజనేయులు, బిఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు కాసం మహిపాల్ రెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గోగుల సరిత వెంకటేష్, మహిళా కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి మెరుగు సునీత, మహిళా కాంగ్రెస్ దమ్మాయిగూడ మున్సిపల్ అధ్యక్షురాలు జూపల్లి శోభా కృష్ణారావు, కాంగ్రెస్ పార్టీ మల్లాపూర్ డివిజన్ అధ్యక్షుడు లంబు శ్రీనివాస్ గౌడ్, నాయకులు ఏఆర్. శ్రీకాంత్, బబ్బి, దొంతం చంద్రశేఖర్, అభిషేక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సత్యంన్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

పోలిశెట్టి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే తూడి

Satyam NEWS

పోలీసుల ఓవర్ యాక్షన్ తో కళ్యాణదుర్గంలో ఉద్రిక్తత

Satyam NEWS

Leave a Comment