33.7 C
Hyderabad
April 29, 2024 01: 52 AM
Slider విజయనగరం

విజయనగరంలో ఘనంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ ర్యాలీ

#vijayanagaramcollector

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు అన్ని చోట్ల “ఆజాదీ కా అమృత మహోత్సవ్” సందర్భంగా ఫైట్ ఫర్ ఫ్రీడమ్ పేరుతో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా విజయనగరం జిల్లా కేంద్రంలో మూడు లాంతర్ల నుంచీ ఆనంద గజపతి ఆడిటోరియం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ లో కళాశాల విద్యార్ధులతో పాటు స్పోర్ట్స్ విద్యార్థులు కూడా పాల్గొన్నారు. అలాగే సైకిల్ ర్యాలీ నిర్వహించారు.

దారి పొడుగునా జాతీయ జెండా తో ఆ ర్యాలీ కొనసాగింది. దారి పొడవునా విద్యార్థులంతా…..భారత్ మాతాకీ జై ,మాతరం మాతరం వందేమాతరం.. జై భవానీ వీరశివాజీ అంటూ నినదించడమే కాకుండా మహనీయులైన మదన్ లాల్ డింగ్రా ,మదన మోహన మాలవీయ ,వీరసావర్కర్ ,వంటి ఫోటోలు ప్రదర్శించి..వాళ్ళు వలనే దేశానికి పరిపూర్ణ మైన స్వేచ్ఛా వాయువులతో పీల్చుకునే స్వాతంత్య్రం వచ్చిందని ఘోషించారు.

ఈ ర్యాలీ కలెక్టర్ సూర్య కుమారీ ,జేసీ వెంకటరావు ,డీఆర్ఓ గణపతిరావు ఇలా జిల్లా అధికారులందరూ పాల్గొన్నారు. ర్యాలీ కి మధ్యలో విఘాతం కలగకుండా ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావు స్వయంగా రంగంలోకి దిగి బందోబస్తు నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ లు భాస్కరరావు, హరిబాబు, దామోదర రావు..ఏఎస్ఐ లు రామకృష్ణలు డీఎస్పీ ఆదేశాల మేరకు…. ర్యాలీకి అడ్డులేకుండా ట్రాఫిక్ ను క్రమబద్దీకరించారు.

అనంతరం ఆనందగజపతి ఆడిటోరియంలో ఏర్పాటైన సభలో కలెక్టర్ మాట్లాడుతూ…మహనీయుల త్యాగఫలమే నేడు దేశ ప్రజలంతా స్వతంత్ర భారతావని ఉండగలుగుతున్నారన్నారు. ఇంట్లో ఉన్నంతవరకే కుటుంబమని బయటకు వస్తే దేశమే ప్రధానమని ప్రతీ ఒక్కరూ గుర్తించాలన్నారు.

Related posts

జనసంద్రంగా మారిన కావలి పట్టణం

Bhavani

అమరావతిపై జగన్ మొండిపట్టుదల వీడాలి

Satyam NEWS

‘దీర్ఘాయుష్మాన్‌భవ’ చిత్రం కైకాల సత్యనారాయణకి అంకితం

Bhavani

Leave a Comment