29.7 C
Hyderabad
May 2, 2024 05: 54 AM
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో అఖండ హరినామ సంకీర్తన పునఃప్రారంభం

#TTD

అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమం సోమవారం తిరుమలలో తిరిగి ప్రారంభమైంది. ఈ సందర్భంగా టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2017లో అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని టిటిడి ప్రారంభించిందని, ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు తదితర రాష్ట్రాలకు చెందిన జానపద కళాకారులు పాల్గొని జానపద శైలిలో భజనలు చేస్తున్నారని తెలిపారు.

కరోనా కారణంగా ఈ కార్యక్రమాన్ని టిటిడి నిలిపివేసిందని, రెండేళ్ల విరామం తర్వాత తిరిగి ప్రారంభమైందని చెప్పారు. ప్రతిరోజూ ఒక్కో జట్టులో 15 మంది చొప్పున 12 బృందాల్లో కళాకారులు పాల్గొంటారని, ఏడాది పొడవునా నడుస్తుందని ఆయన అన్నారు.

7500కు పైగా బృందాల్లో దాదాపు 1.30 లక్షల మంది కళాకారులు నమోదు చేసుకున్నారని, కంప్యూటరైజ్డ్ విధానం ద్వారా ప్రదర్శనకు అవకాశం కల్పిస్తామని ఈఓ తెలిపారు. ఒక్కో బృందం రోజుకు రెండు గంటలపాటు వివిధ షిఫ్టుల్లో ప్రదర్శన ఇస్తుందని ఈఓ తెలిపారు.

ఈ కళాకారులకు వసతి, రవాణ ఛార్జీలు ఇతర సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ముందుగా అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమాన్ని ఈఓ జ్యోతి ప్రజ్వలన, పూజలు చేసి ప్రారంభించారు.  ఈ కార్యక్రమాన్ని ఉదయం 5:30 నుండి 6 గంటల వరకు ఎస్వీబీసీ ప్రత్యక్ష ప్రసారం చేసింది. హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి విజయసారధి, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

వద్దని చెప్పినా రైతులు మొక్కజొన్న పంట వేశారు

Satyam NEWS

ఏజ‌న్సీ ప్రాంత పోలీసులు…గిరిజ‌న ఏరియాల‌లో ప‌ర్య‌టించండి

Satyam NEWS

సీఎం జగన్ 50వ పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం

Satyam NEWS

Leave a Comment