28.7 C
Hyderabad
April 28, 2024 03: 07 AM
Slider సినిమా

నాగార్జునతో వస్తున్న బిగ్ బాస్ నాలుగో సీజన్

#Big Boss 4

తెలుగు టెలివిజన్‌లో అత్యుత్తమ రేటింగ్స్‌ని సాధించి, వినోదానికి సరికొత్త నిర్వచనం ఇచ్చిన అతిపెద్ద నాన్‌ ఫిక్షన్‌ షో బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

2017లో స్టార్‌ మాలో ఒక సంచలనంగా ప్రారంభమై, ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేస్తూ అద్భుతంగా ప్రతి సీజన్‌కీ ఎదుగుదలను నమోదు చేసుకుంది. నాలుగో సీజన్‌కీ స్టార్‌ మా అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ మరింత కొత్తగా ప్రచారాన్ని ప్రారంభిస్తోంది.

ఈ సీజన్‌ ప్రచారంలో భాగంగా కింగ్‌ నాగార్జున చేసిన మూడు పాత్రలు – తాతయ్య, కొడుకు, మనవడు అంచనాలను బాగా పెంచడమే కాదు.. పాజిటివ్‌ రెస్పాన్స్‌ సంపాదించుకున్నాయి. బిగ్‌బాస్‌ సీజన్‌4 కోసం రూపొందించిన ప్రచారం చిత్రంలో నాగార్జున బిగ్‌బాస్‌ని చూడాలనుకునే అన్ని వయసుల వారికీ నాగార్జున వినోదం అందించనున్నారు.

పక్కింట్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ఇష్టపడే జనాల ఉత్సాహానికి కాస్త హాస్యాన్ని జోడించి రూపొందించిన ప్రచార చిత్రమిది. ఇంటిల్లిపాదికీ సంపూర్ణమైన వినోదాన్ని స్టార్‌ మా బిగ్‌బాస్‌ సీజన్‌ 4లో నాగార్జున అందించబోతున్నారు.

వరుసగా రెండవసారి హోస్ట్‌గా బిగ్‌బాస్‌ను నడిపించబోతున్న నాగార్జున మాట్లాడుతూ ప్రోమో కోసం మళ్లీ షూటింగ్‌ ఫ్లోర్‌కి రావడం చాలా సరదాగా ఉంది. గత సీజన్‌ గొప్ప విజయం అందుకున్న తరువాత ఇప్పుడు ప్రేక్షకులకు మరింత ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటుగా సర్‌ప్రైజ్‌లు కూడా అందించే స్థాయిలో ప్రయత్నం చేయబోతున్నాం అని అన్నారు.

మూడు పాత్రలు చేయడం ఒక సవాల్

ప్రచార చిత్రంలో తన లుక్‌ గురించి నాగార్జున మాట్లాడుతూ మూడు పాత్రలు చేయడం, పాత్రకు తగ్గట్టుగా బాడీ లాంగ్వేజీ మెయిన్‌ చేయడం, వాయిస్‌లో జాగ్రత్తలు, మేనరిజంలో వైవిధ్యం చూసుకుంటూ– అదీ తక్కువ సమయంలో షూట్‌ చేయడం పెద్ద ఛాలెంజ్‌. కానీ నేను దాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తూ చేశాను.

అర్థవంతమైన కంటెంట్ తో వస్తున్నాం

జీవితం, ఆశ, వినోదం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగిపోకూడదని నేను నమ్ముతున్నాను. ఈ ఏడాది బిగ్‌బాస్‌ సీజన్‌లో సంపూర్ణమైన వినోదాన్ని అందించబోతున్నాం అని అన్నారు. స్టార్‌ మా అధికార ప్రతినిధి మాట్లాడుతూ అర్థవంతమైన కంటెంట్‌, విభిన్నమైన అంశాలతో  ఉత్తమమైన వినోదాన్ని మేము అందించడాన్ని గర్వంగా భావిస్తున్నాం.

 ప్రతి బిగ్‌బాస్‌ సీజన్‌లో మమ్మల్ని మేము కొత్తగా ఆవిష్కరించుకునే ప్రయత్నం చేస్తున్నాం. ప్రేక్షకులు బాగా ఇష్టపడే షోలలో ఒకటైన బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ చేయడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈ సీజన్‌ను ప్రేక్షకులు తమ ఇళ్లలో కూర్చునే ఆస్వాదిస్తారని ఆశిస్తున్నాం‌ అని అన్నారు.

Related posts

ముత్యoధార లో చిక్కుకున్న వారు సేఫ్

Bhavani

ఏసీబీకి చిక్కిన ముగ్గురు అవినీతి అధికారులు

Sub Editor

కుషాయిగూడ యాదవ సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Bhavani

Leave a Comment