ప్రముఖ తెలుగు హాస్య నటుడు అలీ ఇంట విషాదం నెలకొంది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తల్లి జైతున్ బీబీ సొంత ఊరు రాజమహేంద్రవరంలో కన్నుమూశారు. ప్రస్తుతం ఓ సినిమా షూటింగ్ నిమిత్తం అలీ రాంచీలో ఉన్నారని సమాచారం. తల్లి మరణ వార్త తెలుసుకొని హుటాహుటినా హైదరాబాద్ బయల్దేరారు.
ఆయన తల్లి పార్ధివ దేహాన్ని రాజమహేంద్రవరం నుండి హైదరాబాద్‌కి తీసుకొచ్చేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం. అలీ తల్లి మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖలు తీవ్ర సంతాపం వ్యక్తంచేస్తున్నారు.