42.2 C
Hyderabad
April 26, 2024 16: 41 PM
Slider మెదక్

కొమురవెళ్లి మల్లన్న గుట్ట అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

komaravelly

కొమురవెళ్లి మల్లన్న గుట్టపై రూ.53లక్షల రూపాయల వ్యయంతో నిర్మించనున్న ఎల్లమ్మ దేవాలయ మహా మండపం నిర్మాణ పనులకు రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ నేడు శంకుస్థాపన చేశారు. అనంతరం యాగశాలలోని హోమ గుండాల వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పూర్ణకుంభంతో ఇరు మంత్రులకు ఆలయ అర్చకులు, అధికారులు స్వాగతం పలికారు. మల్లన్న దేవాలయ అభివృద్ధి పనుల పరిసర ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ., పర్యటిస్తూ అక్కడికక్కడే అధికారులతో సమీక్షించి పనులు నిదానంగా జరుగుతున్న తీరుతెన్నులపై అధికారులపై మంత్రి హరీష్ రావు అగ్రహం, అసంతృప్తి వ్యక్తం చేశారు. డిసెంబరు 22వ తేదీన ప్రధాన ముఖ ద్వారం వెండి తొడుగులు తొడగటంలో జాప్యమెందుకని ఆరా తీశారు. కల్యాణ మండపం, మిగతా డోర్లు తొడిగించాలని సూచిస్తూ., నిర్మాణ పనులు తొందరగా పూర్తి చేసే అంశం, ప్రతిపాదనలు సిద్ధం చేయడం మొదలు పనులు పూర్తయ్యే వరకు కాలయాపన చేస్తున్నారని ఇంజనీరింగ్ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాలని స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. శ్రీ కొమురవెళ్లి మల్లన్న దేవస్థానం టెంపుల్ సిటీగా పేరొచ్చేలా ఎస్టిమేషన్ అందంగా, అద్భుతం.. ఉండాలని అధికారిక వర్గాలకు ఇద్దరు మంత్రులు దిశానిర్దేశం చేశారు. ఈ విషయమై వచ్చే నెల జరిగే శ్రీ కొమురవెళ్లి మల్లన్న కల్యాణం రోజున లిఫ్టు సౌకర్యం పూర్తి కావాలని అదే రోజున ప్రారంభోత్సవం జరుపుతామని, లేదంటే చర్యలు తప్పవని ఏఈఓ సుదర్శన్ పనితీరుపై మండిపడ్డారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి వెళ్లేలా రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న రహదారి మరమ్మత్తు పనులు పూర్తి అయ్యాయని, సీసీ రోడ్డు పనులు చేయాల్సి ఉందని., రెండు వారాల్లో సీసీ రోడ్డు పనులు పూర్తి కావాలని అధికారులకు మంత్రి ఆదేశించారు. అలాగే దాచారం గుట్టపై 50 గదులతో నిర్మించనున్న గెస్ట్ హౌస్ నిర్మాణ పనులను తొందరగా పూర్తి చేయాలని మంత్రులు అధికారులను ఆదేశించగా., యేడాదిలోపు పూర్తి చేయనున్నట్లు అధికారులు మంత్రులకు వివరించారు. అదనపు నిధులు రూ.50లక్షల అవసరం ఉన్నాయని పంచాయతీ రాజ్ శాఖ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం మంత్రి హరీశ్ రావు దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించి ఆమోదం తెలిపారు. అదే విధంగా రథం పనులన్నీ పూర్తయినట్లు, మల్లన్న కల్యాణం రోజున అందుబాటులోకి తేవాలని కావాల్సిన ఏర్పాట్లు చేయాలని అధికారిక వర్గాలను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు. ఈ మేరకు నిత్యాన్నదాన సత్రంలో మంత్రులు భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, జెడ్పి చైర్మన్ వేలేటి రోజా రాధాకృష్ణ శర్మ, డీఆర్వో-కొమురవెళ్లి ఆలయ ప్రత్యేక అధికారి చంద్రశేఖర్ ఆలయ నిర్వహాక అధికారులు, పంచాయతీ రాజ్ శాఖ అధికారులు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

Related posts

విజయనగరం రైల్వే స్టేషన్ ప్రాంతంలో ఇంచార్జి డీఎస్పీ ఆధ్వర్యంలో రైడ్స్…!

Bhavani

స్టడీ టూర్: జమ్మూకశ్మీర్‌ కు కేంద్ర మంత్రుల కమిటీ

Satyam NEWS

వివాదాస్పదంగా ఆమీర్ యాడ్‌.. బీజేపీ ఎంపీ అభ్యంతరం..

Sub Editor

Leave a Comment