33.2 C
Hyderabad
May 15, 2024 12: 44 PM
Slider వరంగల్

ఉచిత శిక్షణ అర్హత కోసం 24న బిసి ఓసి మైనారిటీ అభ్యర్థులకు ప్రవేశ పరీక్ష

#mulugu

గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3 గ్రూప్ 4, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ పొందే బిసి ఓసి మైనారిటీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ప్రవేశ పరీక్షను 24న నిర్వహిస్తున్నట్లు ములుగు జిల్లా అదనపు కలెక్టర్ వైవి గణేష్ పేర్కొన్నారు. ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం తరఫున నిరుద్యోగులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ ఆన్లైన్ లో స్క్రీనింగ్ టెస్ట్ కోసం అప్లై చేసుకున్న బిసి  ఓ సి మైనార్టీ అభ్యర్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు రావాలని ఆయన కోరారు.

శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత శిక్షణ అర్హత పరీక్ష ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. రెవిన్యూ శాఖ ఆర్ ఐ డి టి లు సీనియర్ అసిస్టెంట్ లతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ వై వి గణేష్ మాట్లాడుతూ 24 తేదీన ఉదయం 10:30 నుండి 12:30 వరకు ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పరీక్షలు నిర్వహించబడుతున్నాయని అందుకు తగిన ఏర్పాట్లు చేశామని అన్నారు.

ప్రవేశ పరీక్ష రాసేందుకు వచ్చే అభ్యర్థులు తమ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని మొబైల్ కౌంటర్ ఏర్పాటు చేశామని అదేవిధంగా మంచినీటి సరఫరా త్రాగునీరు ఏర్పాటు చేశామని అన్నారు. ఈ ప్రవేశ పరీక్షలు ఇన్విజిలేటర్ గా రెవెన్యూ శాఖకు సంబంధించిన డి టి లు ఆ ర్ఐ లు సీనియర్ అసిస్టెంట్లు వ్యవహరిస్తారని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కలెక్టరేట్ ఏవో విజయభాస్కర్ రెవెన్యూ శాఖకు సంబంధించిన ఆర్ ఐ డి టి లు సీనియర్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు

Related posts

ములుగు జిల్లాలో రైతు చట్టం వ్యతిరేక ఆందోళన

Satyam NEWS

చేయాత పేరుతో 4000పెన్షన్

Bhavani

గెస్ట్ విత్ చెక్: పెళ్లి పందిట్లోనే కళ్యాణలక్ష్మి చెక్కు అందజేత

Satyam NEWS

Leave a Comment