38.2 C
Hyderabad
May 5, 2024 21: 46 PM
Slider కర్నూలు

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

#Draupadimurmu

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం శ్రీశైలం దేవస్థానంలోని సమావేశ మందిరంలో రాష్ట్రపతి ద్రౌపదిముర్ము పర్యటన కార్యక్రమ ఏర్పాట్లపై జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ టి. నిశాంతిలతో కలిసి సమీక్ష నిర్వహించారు. శ్రీశైల దేవస్థాన ట్రస్ట్ బోర్డు చైర్మన్ రెడ్డి వారి చక్రపాణిరెడ్డి, ఇంటెలిజెన్స్ రిటైర్డ్ ఓఎస్డి శశిధర్ రెడ్డి, డిఆర్ఓ పుల్లయ్య, దేవస్థాన ఈఓ లవన్న, సంబంధిత జిల్లాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ మాట్లాడుతూ భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము ఈ నెల 26వ తేదీ శ్రీశైల మహా పుణ్యక్షేత్ర పర్యటనలో ఎలాంటి లోటుపాట్లకు తావివ్వకుండా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సమావేశానికి గైరు హాజరైన సివిల్ సర్జన్, ఎప్స్పీడ్సీఎల్ ఎస్ఈ, ఆర్టీసీ ఈఈ లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డిఆర్ఓను ఆదేశించారు. రాష్ట్రపతి కార్యక్రమానికి పటిష్ట కేంద్ర బందోబస్తు వుండడం వల్ల ఎక్కడా మూమెంట్ ఉండదని… పర్యటనకు ఒక రోజే సమయం ఉన్నందున అధికారులకు కేటాయించిన విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించి విజయవంతం చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

భారత రాష్ట్రపతి పాల్గొనే సున్నిపెంట హెలిప్యాడ్, శ్రీశైల ప్రధానాలయం, టూరిజం ఫెసిలిటేషన్ సెంటర్, శివాజీ స్ఫూర్తి కేంద్ర ప్రదేశాల్లో విధులు నిర్వహహించే అధికారులు, సిబ్బందికి వేర్వేరు రకాలతో, సంబంధిత ఉద్యోగి ఐడెంటిటీ కార్డుతో సరి పోల్చుకొని గుర్తింపు కార్డులు మంజూరు చేయాలని కలెక్టర్ డిఆర్ఓను ఆదేశించారు. రాష్ట్రపతి విధుల్లో పాల్గొనే అధికారులకు ప్రాధాన్యత క్రమంలో కోవిడ్ పరీక్షలు నిర్వహించాలని డియంహెచ్ఓను ఆదేశించారు.

ఆదివారం ఉదయం నిర్వహించే ట్రయల్ రన్ లో అధికారులకు కేటాయించిన ప్రదేశాల్లో వుండాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతికి ఇచ్చే ఆహార పదార్థాలు, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి తీర్థ ప్రసాద వితరణ కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయాలని ఫుడ్ సేఫ్టీ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. హెలిప్యాడ్‌ నుండి రాష్ట్రపతి పాల్గొనే ప్రదేశాల్లో ముమ్మర పారిశుధ్య చర్యలు చేపట్టేందుకు అధిక సంఖ్యలో పారిశుధ్య కార్మికులు, సూపర్వైజర్లను నియమించాలని డిపిఓ, ఆత్మకూరు మునిసిపల్ కమీషనర్ ను కలెక్టర్ ఆదేశించారు. అలాగే నాలుగు ప్రదేశాల్లో తాత్కాలిక టాయిలెట్లు ఏర్పాటు చేయడంతో పాటు విద్యుత్ అంతరాయం లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

భ్రమరాంబ అతిధి గృహంలో రాష్ట్రపతి విడిది ఏర్పాట్లలో ఎలాంటి చిన్న పొరపాట్లకు తావివ్వకుండా అన్ని విధాలా ముందస్తు చర్యలు తీసుకోవాలని దేవస్థాన ఈఓను కలెక్టర్ ఆదేశించారు. శ్రీశైల ప్రధాన గోపురమైన శ్రీకృష్ణదేవరాయ గోపురం వద్ద ఆలయ సాంప్రదాయాలతో భారత రాష్ట్రపతికి పూర్ణకుంభంతో స్వాగతం పలికి… భ్రమరాంబ శ్రీ మల్లికార్జున స్వామి వారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని దేవస్థాన కార్యనిర్వహణాధికారి లవన్నను కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్రపతి పర్యటించే రహదారిలో గుంతలు లేకుండా చూడటంతో పాటు సైడ్ లో వైట్ పెయింటింగ్ తో మార్కింగ్ ఇవ్వాలని ఆర్ అండ్ బి, ఎన్ హెచ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

కాన్వాయ్ లో చెంచు విద్యార్థుల సుస్వాగత నృత్యం, చెంచులతో ముఖాముఖి కార్యక్రమాల నిర్ణీత తక్కువ సమయంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. రాష్ట్రపతి కార్యక్రమాన్ని అధికారులు అందరూ సమన్వయంతో కృషి విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్, ఎస్పీలు ట్రయిల్ రన్ నిర్వహించి అధికారులకు, పోలీసులకు పలు సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు శ్రీనివాసులు, వెంకటరెడ్డి, ఎం దాసు సంబందిత జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

రెడ్ హాండెడ్: ఏసీబీకి దొరికిన మరో రెవెన్యూ లంచగొండి

Satyam NEWS

ఆంధ్రోళ్లను తిట్టిన నోటితో ఇప్పుడు పార్టీలో ఎలా చేర్చుకుంటున్నావ్?

Satyam NEWS

ప్రయివేటు టీచర్లను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment