38.2 C
Hyderabad
May 1, 2024 20: 25 PM
Slider వరంగల్

మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు ఏర్పాట్లు

#mlaseetakka

ములుగు జిల్లా తాడ్వాయి మండలం లోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ వన దేవతలను జిల్లా ఇంఛార్జి మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకున్నారు. ఈ కార్యక్రమంలో ములుగు ఎమ్మెల్యే సీతక్క తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మేడారం జాతర అభివృద్ధి పై రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని, పనులు వేగవంతం చేయాలని కోరారు.

జాతరకు వచ్చే భక్తులకు అవసరమైన అన్ని వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆమె సంబంధిత అధికారులను ఆదేశించారు. నెల రోజుల క్రితం ములుగు జిల్లా అధికార యంత్రాంగం అంచనా వేసిన 111 కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేసిందని తెలిపారు.

నాణ్యత మైన పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక పాత్ర పోషించాలని మంత్రి కోరారు. మేడారం జాతర కాకుండా మిగతా పిల్ల జాతరకు నిధులు మంజూరు చేయాల్సి ఉంది. పిల్ల జాతర లైన కొండాయి, పునుగొండ్ల పగిడిద్దరాజు, తిరుగు వారం జాతర లకు ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క మంత్రిని కోరారు.

Related posts

ఓటు హక్కు పై అవగాహన కల్పించాలి

Bhavani

ప్రతి విషయానికీ ఆందోళన చెందవద్దు

Satyam NEWS

ఫర్ కమ్యూనికేషన్స్:ఈనెల 17 అంతరిక్షం లోకి జీశాట్-30

Satyam NEWS

Leave a Comment