36.2 C
Hyderabad
April 27, 2024 22: 44 PM
Slider ప్రత్యేకం

ప్లాస్టిక్ వినియోగం మానవాళికి ప్రమాదకరం

#plastic

ప్లాస్టిక్ వినియోగం మానవాళికి చాలా ప్రమాదకరమని ఉప్పల్ నియోజకవర్గంలోని మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి అన్నారు. గోకుల్ నగర్ లో శనివారం శ్రేయస్ కాలేజీ 100 మంది విద్యార్థులు ప్లాస్టిక్ వస్తువులను సేకరించారు. అజాదీకా అమృత మహోత్సవ్  లో భాగంగా నెహ్రు యువకేంద్రం, మినిస్టరీ ఆఫ్ యూత్ ఎఫైర్స్ సూచన మేరకు ఈ కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ దేవేందర్ రెడ్డి, కాప్రా డిప్యూటీ కమిషనర్ శంకర్, జిల్లా యూత్ ఆఫీసర్ ఐసయ్య పాల్గొన్నారు. గోకుల్ నగర్ లో దాదాపు 700 కిలోల ప్లాస్టిక్ ను విద్యార్ధులు సేకరించారు. అదేవిధంగా కాలని వాసులకు ప్లాస్టిక్  వినియోగం గురించి వాటివల్ల వచ్చే అనర్ధాల గురించి  అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో  SS నాగరాజు తో పాటు జవాన్లు సర్కిల్లో అధికారులు టిఆర్ఎస్ నాయకులు పద్మా రెడ్డి రాపోలు శ్రీను ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు.

Related posts

ములాయం స్థానంలో ఆయన కోడలు పోటీ

Satyam NEWS

హైదరాబాద్ పేలుళ్ల కుట్ర కేసులో కొత్త మలుపు

Bhavani

రంగుల తయారీ కంపెనీలో ప్రమాదం

Bhavani

Leave a Comment