42.2 C
Hyderabad
May 3, 2024 16: 53 PM
Slider ముఖ్యంశాలు

నరసరావుపేట స్కూల్ ను ఆకస్మిక తనిఖీ చేసిన హెన్రి క్రిస్టినా

#narasaraopetmla

గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని మునిసిపల్ పాఠశాల, బాలికోన్నత పాఠశాలలో జడ్పీ చైర్ పర్సన్ హేన్రి క్రిస్టినా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నరసరావుపేట శాసన సభ్యుడు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్ పర్సన్ ఉపాధ్యాయులతో మాట్లాడి నాడు నేడు ద్వారా పాఠశాలకు జరిగిన అభివృద్ధి పనుల గురించి తెలుసుకున్నారు.

10 తరగతి విద్యార్థులతో మాట్లాడి అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనం తదితర పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. పలు సబ్జెక్టుల గురించి విద్యార్థులకు ప్రశ్నలు సంధించిన ఎమ్మెల్యే, తాను అడిగిన ప్రశ్నలకు విద్యార్ధులు ఇంగ్లీష్ లో విద్యార్థులు సమాధానాలు చెప్పడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. విద్యపై పెట్టే ఖర్చు ఎప్పటికి వృథా కాదు అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చెబుతుంటారని ఆ మాటను ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.

విద్యార్థుల చదువుకు సంబంధించి ఎలాంటి సహాయం కావాలన్న వెంటనే స్పందిస్తానని హామీ ఇచ్చారు. జడ్పి చైర్ పర్సన్  హేన్రి క్రిస్టినా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యపై ప్రత్యేక శ్రద్ద పెట్టిందని, విద్యార్థులు అంతా ప్రభుత్వం అందిస్తున్న పథకాలు సద్వినియోగం చేసుకుంటూ మంచి ఫలితాలు సాధించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు, ఇతర ఉపాధ్యాయులు, అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Related posts

నో వ్యాలెంటైన్ డే: అమరవీరులకు జై కొట్టు

Satyam NEWS

హిందూ ధ‌ర్మ‌ప్ర‌చారంలో భాగ‌స్వాములం కావ‌డం సంతోష‌క‌రం

Satyam NEWS

కరణం బలరాం కుమార్తె పట్ల ఓ డాక్టర్ ఓవరాక్షన్

Satyam NEWS

Leave a Comment