39.2 C
Hyderabad
May 3, 2024 12: 55 PM
Slider ప్రత్యేకం

మహాశివరాత్రి మహోత్సవానికి కోటప్పకొండ సిద్ధం

#Kotappakonda

పవిత్ర పుణ్యక్షేత్రం అయిన కోటప్పకొండ మహా శివరాత్రి మహోత్సవాలకు సిద్ధం అయింది. విశేషంగా తరలి వచ్చే భక్తుల కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా దిగువ కొండ ,ఎగువ కొండ వద్ద  సకల సదుపాయాలు కల్పిస్తున్నది. గుంటూరు జిల్లా నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అధికారులతో సమావేశం అయ్యి తిరునళ్ళు ఏర్పాట్ల పై సమీక్ష సమావేశం నిర్వహించారు.

దాదాపు పది లక్షల మంది భక్తులు కొండకి వస్తారని అధికారుల అంచనా. కొండ కింద  ప్రభుత్వం వారు ప్రతి ఏడాది ఏర్పాటు చేసే స్టాల్స్ ను ప్రత్యేక రూపురేఖలతో ఈ ఏడాది ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే భక్తుల కోసం తలనీలాలు సమర్పించే సమయంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అని ఏర్పాట్లు చేశారు.

గత ఏడాది తో పోల్చితే ఈ ఏడాది భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేస్తున్నారు. మెట్ల మార్గంలో వచ్చే భక్తుల కోసం చలివేంద్రాలతో పాటు కొన్ని స్వచ్చంద సంస్థల వారు మంచి నీరు,మజ్జిగ ప్యాకేట్ లను కూడా అందిస్తున్నారు.

వృద్దులకు, వికలాంగులకు కొండ పైనుండి దర్శనం కోసం ప్రత్యేక లిఫ్ట్ సౌకర్యం కూడా  ఏర్పాటు చేశారు. అధికంగా ఎండ ఉంటుంది కాబట్టి భక్తుల ఎండ తగలకుండా తాటాకు పందిళ్లు వెయిస్తున్నారు. ఇప్పటికే లడ్డు,అరిసెలు సిద్ధం  చేశారు.

ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా 2000 పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. రెడ్ క్రాస్,స్కౌట్స్ అండ్ గైడ్స్ లాంటి కొన్ని స్వచ్చంద సంస్థలు సహకారం అందిస్తున్నాయి.

9 మెడికల్ క్యాంప్ లతో పాటు  200 మందికి అత్యావసర్ చికిత్స కోసం అవసరము అయిన కిట్లు కూడ సిద్ధం చేసినట్లు మెడికల్ అధికారులు తెలిపారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యం న్యూస్

Related posts

నిర్మలమ్మా… ఆత్మనిర్భర్ భారత్ ఆదుకోవడం లేదమ్మా

Satyam NEWS

జనతా కర్ఫ్యూ విజయంపై ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి హర్షం

Satyam NEWS

బీజేపీ, టిడిపి, వామపక్షాల ఆధ్వర్యంలో సంబరాలు

Satyam NEWS

Leave a Comment