23.2 C
Hyderabad
May 7, 2024 22: 26 PM
Slider కరీంనగర్

రాష్ట్రంలో పేదలకు బలవర్ధక బియ్యం అందించేందుకు సర్వం సిద్దం

#gangula

రాష్ట్రంలోని పేదలందరికీ సంపూర్ణ పోషకాహారం అందించి, వారి ఆరోగ్యానికి బాటలు పరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, ఎప్రిల్ నెలనుండి రాష్ట్ర వ్యాప్తంగా సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలు, ఐసీడీఎస్, మధ్యాహ్న బోజన పథకాలతో పాటు 11జిల్లాల పరిధిలో ఉన్న ప్రతీ రేషన్ కార్డుదారుకు బలవర్ధక బియ్యాన్ని అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు నేడు హైదరాబాద్ లోని తన నివాసంలో పౌరసరఫరాల శాఖ ఉన్నతాధికారులతో పంపిణీ ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి గంగుల కమలాకర్.

గ్రామీణ, పట్టణ పేద ప్రజలు పోషకాహార లోపంతో అనేక ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ముఖ్య పోషకాలైన ఐరన్, ఫోలిక్ ఆసిడ్, బీ12 విటమిన్లతో కూడిన ఫోర్టిఫైడ్ రైస్ కెర్నల్స్ ఉన్న బలవర్థక బియ్యంను రేషన్ ద్వారా పంపిణీ చేస్తామన్నారు మంత్రి గంగుల కమలాకర్. దాదాపు రాష్ట్రంలోని అన్ని మిల్లుల్లోనూ బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటయ్యాయని, ఫోర్టిఫైడ్ బియ్యాన్ని ఎప్.సి.ఐకి సీఎంఆర్లో బాగంగా 35 లక్షల మెట్రిక్ టన్నులు అందించగా మన ప్రజాపంపిణి అవసరాల కోసం సివిల్ సప్లైస్ కార్పోరేషన్ 11 లక్షల మెట్రిక్ టన్నులను ఇప్పటికే సేకరించిందన్న మంత్రి, వీటిని ఎప్రిల్ నెలనుండి 11జిల్లాల లబ్దీదారులకు అందజేస్తామన్నారు. మిగతా జిల్లాల్లో సైతం విడతల వారీగా 2024 మార్చి వరకూ ఫోర్టిఫైడ్ బియ్యం పంపిణీకి చర్యలు తీసుకుంటున్నామన్నారు, కోట్ల రూపాయల అధనపు బారానికి వెరవకుండా సీఎం కేసీఆర్ పేదల ఆరోగ్యం కోసం పాటుపడుతున్నారన్నారు మంత్రి గంగుల కమలాకర్.

2021 సెప్టెంబర్లో జయశంకర్ భూపాల పల్లి జిల్లాలో ఫైలట్ ప్రాజెక్టుగా మొదలైన బలవర్ధక బియ్యం పంపిణి తరువాత రాష్ట్రవ్యాప్తంగా ఐసీడిఎస్, మద్యాహ్నబోజన పథకం, హాస్టళ్లకు అందించింది. అనంతరం మే 2022 నుండి అధిలాబాద్, అసిపాబాద్, బద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రజాపంపిణి చేస్తుంది, తాజాగా రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, హన్మకొండా, మంచిర్యాల, నిర్మల్, ఖమ్మం, మరియు వికారాబాద్ 7జిల్లాల పరిధిలో పౌరసరఫరాల శాఖ ఎప్రిల్ నెలలో బలవర్ధక బియ్యం పంపిణీకి సర్వం సిద్దం చేసింది.

Related posts

మున్నూరు కాపు సంఘం 7వ రోజు అన్నదాన కార్యక్రమం

Satyam NEWS

చంద్రబాబుపై రాళ్ల దాడి: స్థానిక పోలీసులపై చర్యలు తప్పవా?

Satyam NEWS

3న జరిగే చలో హైదరాబాద్ విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment