23.2 C
Hyderabad
May 7, 2024 22: 54 PM
Slider నిజామాబాద్

రైతులంతా రుణ మాఫీ సౌకర్యాన్ని అందుకోండి

#bichkunda

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని రైతు సేవా సహకార సంఘం కార్యాలయంలో పాలకవర్గ సంఘ సమావేశం సోమవారం సంఘం అధ్యక్షులు నాల్చర్ బాలాజీ (బాలు) ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 341 మంది రైతులకు గాను ఒక్క కోటి 14 లక్షల 55 వేల 409 రూపాయలు రుణమాఫీ వర్తించింది అని తెలిపారు. 50వేల రూపాయల లోపు రుణాలు తీసుకున్న వారికి ఈ రుణమాఫీ వర్తిస్తుందన్నారు. 

అలాగే మిగతా రుణo తీసుకున్న రైతులు కూడా సకాలoలో వడ్డీ కట్టి రెనువల్ చేసుకోవాలని తీర్మానం చేశారు ఈ రుణమాఫీకి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, జుక్కల్  శాసనసభ్యులు హనుమంతు షిండే లకు  రైతుల తరఫున, సహకార సంఘం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అర్హులైన రైతులు తమ వడ్డీల ను చెల్లించి రుణాలను రెన్యువల్ చేసుకోవాలని ఆయన సూచించారు.  కార్యక్రమంలో చైర్మన్ తో పాటు వైస్ చైర్మన్ యాదరావ్, సొసైటీ సీఈఓ శ్రావణ్ కుమార్, పాలకవర్గ సభ్యులు సిబ్బంది ఉన్నారు.

జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం

Related posts

ఇల్లిసిట్ లిక్కర్: ఎక్సైజ్ అధికారుల పై ఫిర్యాదుల వెల్లువ

Satyam NEWS

రక్తదానం చేయడానికి యువత ముందుకు రావాలి

Bhavani

ప్రజలే ప్రభువులుగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పాల‌న

Satyam NEWS

Leave a Comment