మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు సరిహద్దు మండలాలైన జుక్కల్, మద్నూర్, బిచ్కుంద, పెద్ద కొడప్గల్, పిట్లం మండలాల్లోని గ్రామాల్లో యధేచ్చగా కల్తీ కల్లు విక్రయాలు జరుగుతున్నాయని జుక్కల్ నియోజకవర్గ ప్రజల సౌకర్యార్థం ప్రతి మొదటి శనివారం బిచ్కుంద మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ ర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
కల్తీ కల్లు సేవించిన ప్రజల ఆరోగ్యాలు చెడిపోతన్నాయని కల్తీకల్లు విక్రయాలను నియంత్రించాల్సిన ఎక్సైజ్ అధికారులు మామూళ్ల ముసుగులో పట్టించుకోవడంలేదని వారు ఫిర్యాదు చేశారు. ఆయా మండలాలకు చెందిన ప్రజలు ఫిర్యాదు చేయడంతో కామారెడ్డి జేసీ యాదిరెడ్డి సీరియస్ గా తీసుకున్నారు. నియోజకవర్గంలో గంజాయి సాగు, విక్రయాలు యథేచ్ఛగా కొనసాగేవని, ఫిర్యాదు చేసినా ఎక్సైజ్ అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ప్రజావాణి కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ తో పాటు డిఆర్డిఎ పిడి చంద్రమోహన్ రెడ్డి తాసిల్దార్ వెంకట్రావు ఎంపీడీవో ఆనంద్ ఆయా శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.