42.2 C
Hyderabad
May 3, 2024 15: 29 PM
Slider కరీంనగర్

వరద ముంపుకు గురైన బుడగ జంగాల ను ఆదుకుంటాం

#Ramateerdhapu

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరద నీటిలో ముంపుకు గురైన బుడగ జంగాల కుటుంబాలను అన్ని విధాలుగా ప్రభుత్వపరంగా ఆదుకుంటామని మున్సిపల్ అధ్యక్షురాలు రామతీర్థపు మాధవి అన్నారు.  సోమవారం కోనాయిపల్లి రహదారిలోని బుడగ జంగాల కాలనీ ఆమె కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తో కలిసి పరిశీలించారు. 

అనంతరం మాట్లాడుతూ భారీగా కురిసిన వర్షాలతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని  గౌరవ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు సహకారంతో ఆదుకుంటాం అన్నారు. ఇప్పటికే వరద నీటిలో పూర్తిగా కోల్పోయిన కుటుంబాలను ప్రత్యేక వసతి సదుపాయం కల్పించి అప్పటికప్పుడు ఆదుకున్న మని గుర్తుచేశారు.

ఎమ్మెల్యే రమేష్ బాబు చొరవతో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి  భోజన వసతి కల్పించి అవసరమైనవారికి మరిన్ని సౌకర్యాలు కూడా కల్పించామన్నారు. విద్యుత్ దీపాలు ఇతర అవసరాలకు కూడా తక్షణమే ఏర్పాటు చేస్తామన్నారు. ఆమె వెంట కమిషనర్ మట్ట శ్రీనివాసరెడ్డి, పట్టణ సెస్ డైరెక్టర్ రామతీర్థపు రాజు, కౌన్సిలర్లు గడ్డమీది లావణ్య నరాల శేఖర్ తదితరులు ఉన్నారు.

విశ్వ హిందూ పరిషత్ వారు హైకోర్టు నుండి కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా భౌతిక దూరం పాటిస్తూ గణపతి నవరాత్రులు జరుపుకోవచ్చని పర్మిషన్ ఇచ్చినా కూడా ప్రభుత్వ యంత్రాంగం ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నదని వారన్నారు. ఈ నిర్లక్ష్య వైఖరి హిందువులపై చిన్నచూపు ఎందుకని వారు ప్రశ్నించారు.

ప్రజలు నీచమైన మత రాజకీయాలు అన్ని గమనిస్తూనే ఉన్నారని,  ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెట్టే రోజు ముందుందని అన్నారు. ఈ కార్యక్రమం లో హుజూర్ నగర్ బీజేవైఎం అధ్యక్షులు వల్లపుదాసు గోపీనాథ్ గౌడ్, దెనుమకొండ రామరాజు, పెండెం నరేష్, శివరాం, శివ చారి, మురళి,శివ, దత్తు, మరియు హిందూ సంఘం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అగ్లీ ఫెలోస్: బాలికపై పై కిరాతకానికి పాల్పడ్డ నీచులు

Satyam NEWS

హెచ్ఓడి లకు కూడా ఇక ఫేస్ రికగ్నిషన్ తప్పని సరి

Satyam NEWS

డిన్నర్ పాలిటిక్స్: వైసిపి ఎంపిలు రాజుగారి విందుకు వెళతారా?

Satyam NEWS

Leave a Comment