Slider జాతీయం

డిన్నర్ పాలిటిక్స్: వైసిపి ఎంపిలు రాజుగారి విందుకు వెళతారా?

raghuramakrishanmraju

వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన భారీ విందుకు ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసిపి ఎంపిలు వెళతారా? ఈ విషయంలో ఎవరికి స్పష్టత లేదు. ఎందుకంటే రఘురామకృష్ణంరాజు ఇస్తున్న విందుకు వెళ్లాలా వద్దా అనే అంశంపై వైసిపి ఎంపిలు రెండు వర్గాలుగా విడిపోయారు.

కొందరు ఇది ధిక్కార విందు అని అందువల్ల హాజరు కావాల్సిన అవసరం లేదని వాదిస్తుండగా మరి కొందరు మాత్రం మన ఎంపి ఇచ్చే విందుకు మనం వెళ్లకపోతే మన పరువే పోతుందని అంటున్నారు. వైసిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయసాయి రెడ్డి కొందరు ఎంపిలతోనే సఖ్యతగా ఉండటం, కొందరితో అంటీ ముట్టనట్లు ఉండటం వైసిపి పార్లమెంటరీ పార్టీలో గత కొద్ది కాలంగా చిచ్చు రేపుతూనే ఉన్నది.

ఢిల్లీలోని తన లాబీని మరింత పటిష్టం చేసుకోవడానికి రఘురామకృష్ణంరాజు ఇలా విందు ఇస్తున్నారని, ఇది పార్టీకి ఎలాగూ ఉపయోగపడదని విజయసాయిరెడ్డి వర్గానికి చెందిన ఎంపిలు అంటున్నారు. విజయసాయిరెడ్డి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తూ రఘురామకృష్ణంరాజు ఈ విందు ఏర్పాటు చేసినందున ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా వెళ్లరాదని వారు అంటున్నారు.

అయితే ప్రధాని, హోం మంత్రి హాజరయ్యే అవకాశం ఉన్నందున జగన్ వెళ్లకపోతే పరిస్థితి వేరుగా ఉంటుందని కొందరు వాదిస్తున్నారు. ఢిల్లీలో రఘురామకృష్ణంరాజుకు ఇంకా క్వార్టర్సు కేటాయించినందున తన వియ్యంకుడు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు అయిన కె వి పి రామచంద్రరావు ఇంట్లో ఈ విందును ఏర్పాటు చేశారు.

కె వి పి రామచంద్రరావు దివంగత ముఖ్యమంత్రి వై ఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితుడు. అయితే వై ఎస్ మరణం తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలోనే ఉండిపోయారు తప్ప వై ఎస్ రాజశేఖరరెడ్డి కుమారుడైన వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి వైపు వెళ్లలేదు. జగన్ కూడా కెవిపిని పార్టీలోకి ఆహ్వానించలేదు.

ఈ దశలో కెవిపి ఇంట్లో విందు ఏర్పాటు చేస్తే జగన్ కు ఇబ్బంది అవుతుంది. అందుకే అకస్మాత్తుగా రఘురామకృష్ణంరాజు విందు స్థలాన్ని కెవిపి ఇంటి నుంచి జన్ పథ్ లోని వెస్ట్రన్ కోర్టు కు మార్చారు. ఈ మార్పును బట్టి విందుకు జగన్ హాజరవుతారని అనుకుంటున్నా ఇప్పటి వరకూ క్లారిటీ లేదు.

Related posts

సంపన్నుల కోసమే నూతన జాతీయ విద్యా విధానం

Murali Krishna

బీసీలకు న్యాయం చేయాలి… టీడీపీ బిసినేతల నిరసన..

Satyam NEWS

కోనసీమ జిల్లా అల్లర్లు భావోద్వేగం కారణంగా జరిగినవే

Satyam NEWS

Leave a Comment