37.2 C
Hyderabad
May 2, 2024 13: 16 PM
Slider నల్గొండ

22న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

#INTUC Hujurnagar

దీర్ఘకాలంగా కార్మికులకు రక్షణ కవచాలుగా ఉన్న కనీస వేతన చట్టం,  మెటర్నటీ లీవ్ చట్టం, పది గంటల విధాన చట్టాలను కేంద్ర ప్రభుత్వం సూచనలతో కొన్ని రాష్ట్రాలలో సవరించడాన్ని నిరసిస్తూ ఈ నెల 22వ తేదీన అన్ని నియోజకవర్గ కేంద్రాలలో ఒకరోజు నిరాహార దీక్ష విజయవంతం చేయాలని ఐ ఎన్ టి యుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ అన్నారు.

దక్కన్ సిమెంట్స్ (జాన్ పాడ్) ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఐఎన్టియుసి అనుబంధ జెండాను రాష్ట్ర ఐఎన్టీయూసీ ప్రధాన కార్యదర్శి యరగాని నాగన్న గౌడ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో వెయ్యి రోజుల ప్రణాళిక పేరుతో కార్మిక చట్టాలను సవరిస్తున్నారని తెలిపారు. దీనికి నిరసనగా  ఐ ఎన్ టి యుసి తో సహా 10 సెంట్రల్ ట్రేడ్ యూనియన్ లు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.

ఈ ఒకరోజు నిరాహార దీక్ష లో అన్ని కార్మిక సంఘటిత/అసంఘటిత యూనియన్లు ఉదయం 10 గంటలనుండి  దీక్షలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఎంపీపీ గోపాల్ నాయక్ మాట్లాడుతూ దక్కన్ సిమెంట్స్ వారు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలను  చేపట్టాలని కోరారు. యూనియన్ ప్రధాన కార్యదర్శి వీరనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ హనుమరాజు ఆధ్వర్యంలో ఇట్టి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐఎన్టియుసి అధ్యక్షులు బెల్లం కొండ గురవయ్య, సైదులు యాదవ్,ఆర్టీసీ యూనియన్ నాయకులు సైదానాయక్, భీమానాయక్,ఎంపీటీసీ,బాలయ్య, వెంకట్రావు,సైదారావు,శ్రీను,సాగర్, కొండలరావు, రామారావు, మట్టయ్య, రవి తదితరులు పాల్గొన్నారు.

Related posts

అమాంతంగా పెరుగుతున్న కరోనా కేసులు

Satyam NEWS

విశాఖ పోలీస్ కమిషనర్ గా త్రివిక్రమ్ వర్మ

Bhavani

వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పని చేయవద్దు

Bhavani

Leave a Comment