28.7 C
Hyderabad
May 6, 2024 00: 53 AM
Slider ముఖ్యంశాలు

జర్నలిస్టులు అందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలి

All journalists

సూర్యాపేట జిల్లాలోని జర్నలిస్టులందరికీ ప్రభుత్వం వెంటనే ఇళ్ళు,ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలని, ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలు అన్నింటిని సత్వరమే అమలు చేయాలని టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా అధ్యక్షుడు కోల నాగేశ్వరరావు కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో టియుడబ్ల్యూజే యూనియన్ సమావేశం జరిగింది.ఈ సందర్భంగా కోలా నాగేశ్వరరావు మాట్లాడుతూ సిఎం కెసిఆర్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం దృష్టి పెట్టాలన్నారు.వృత్తిని నమ్ముకుని గత కొన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం అండగా ఉండాలని సూచించారు.

కార్పొరేట్ వైద్యశాలలో హెల్త్ కార్డులు సక్రమంగా పనిచేసేలా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని కోరారు.ప్రభుత్వ పాఠశాలలు,కళాశాలలో జర్నలిస్టుల కుటుంబాలకు చెందిన పిల్లలకు 50 శాతం సబ్సిడీపై విద్యను అందించాలని, అందుకోసం ప్రభుత్వం జీవో జారీ చేయాలని అన్నారు.జర్నలిస్టులతో పాటు డేస్కుల్లో పనిచేస్తున్న సబ్ ఎడిటర్లకు కూడా పూర్తి స్థాయిలో అక్రిడేషన్లు కల్పించాలని అన్నారు.అనంతరం జిల్లా మహాసభ నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు.

జిల్లా మహాసభకు జిల్లాలోని వివిధ మండలాల నుండి తరలివచ్చి పూర్తి గా సహకరించిన జర్నలిస్టులు అందరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు జిల్లాలో జర్నలిస్టు ఉద్యమాలు చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు టి.వి.ఎల్,దేనుమకొండ శేషం రాజు,బసవోజు శ్రీనివాసాచారి,షేక్ జానీ పాషా,పెందుర్తి భాస్కర్, పిల్లలమర్రి శ్రీనివాస్, ఆర్ పి గౌడ్,కోమర్రాజు అంజయ్య,దేవరం వెంకటరెడ్డి,ఇట్టిమల్ల రామకృష్ణ,చిట్టి పోతుల రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

జనసేన అధినేత రాకకై విజయనగరం లో ఎదురు చూపులు…!

Satyam NEWS

టిఆర్ఎస్ ని ఎదుర్కొనే దమ్ము ఒక్క బీజేపీ కి మాత్రమే వుంది

Satyam NEWS

బత్తాయిని ప్రభుత్వమే కొనుగోలు చేసి ప్రజలకు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment