37.2 C
Hyderabad
May 6, 2024 12: 32 PM
Slider విజయనగరం

మేయర్ నుంచీ హోంమంత్రి వరకూ అందరూ మహిళలే

#minister pushpa vani

పొరుగు రాష్ట్ర మైన తెలంగాణ లో జరిగిన ఓ దారుణ ఘటనకు చలించిపోయిన సీఎం జగన్….ఏపీలో ‘దిశ’ పేరుతో యాప్ ని తీసుకొచ్చారని తద్వారా ఆడవాళ్లపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టవచ్చని రాష్ట్ర డిప్యూటీ సీఎం గిరిజన శాఖ మంత్రి పాముల పుష్పశ్రీవాణి అన్నారు. విజయనగరం జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో దండుమారమ్మ టెంపుల్ లో ‘దిశ’ యాప్ పై జరిగిన అవగాహన కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పాల్గొని మాట్లాడారు.

విజయనగరం మేయర్ దగ్గర నుంచీ డిప్యూటీ మేయర్, ఎస్పీ.కలెక్టర్ ఇలా అన్ని ప్రభుత్వ శాఖల అధిపతులంతా మహిళలే ఉన్న ఈ సమయంలో ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ‘దిశ’ యాప్ ను అందరి చేత డౌన్ చేయించి జిల్లా ఖ్యాతి ని మరి సారి నిలబెట్టాలన్నారు. ‘దిశ’ యాప్ అన్నది మహిళలకు ఓ భద్రత ,ఓ భరోసా..,ఓ ధీమా లాంటిందన్నారు.ప్రతీ ఒక్క మహిళ సాధ్యమైనఞతవరకూ ఏండ్రాయిడ్ సెల్ ఫోన్ ను ఉపయోగిస్తున్నారని తప్పకుండా ‘దిశ’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు.

ఏ ఆపద సమయంలో నైనా ఎస్ఓఎస్ బటన్ నొక్కి తే క్షణాల్లో మన  ముందు పోలీసులు ఉంటారని డిప్యూటీ సీఎం అన్నారు. అనంతరం ఎస్పీ దీపికా ఎంం పాటిల్ మాట్లాడుతూ… జిల్లా వల్లర బుల్ ప్రాంతాలను గుర్తించామని ఆయా ప్రాంతాల్లో అనుక్షణం తమ సిబ్బంది గస్తీ కాస్తున్నారని తెలిపారు.

మేయర్ వీ.వీజయలక్ష్మీ మాట్లాడుతూ ‘దిశ’ యాప్ పై అవగాహన పెంపొందించుకోవాలన్నారు.అనంతరం దండుమారమ్మ టెంపుల్ నుంచీ ఏసీబీ ఆఫీసు మీదుగా ‘దిశ’ పీఎస్ వరకు అవగాహన ర్యాలీ జరిగింది. ‘దిశ’ పీఎస్ వద్ద నుంచీ నగరంలో నిర్వహించిన ర్యాలీ నీ జిల్లా కలెక్టర్ సూర్యకుమారి జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ‘దిశ’ డీఎస్పీ త్రినాధ్, నగర డీఎస్పీ అనిల్, ట్రాఫిక్ డీఎస్పీ మోహనరావు,ఏఆర్ డీఎస్పీ శేషాద్రి, ఎస్.బీ సీఐలు శ్రీనివాసరావు, రాంబాబు,ట్రాఫిక్ ఎస్ఐలు కళాశాల విద్యార్థినిలు పాల్గొన్నారు.

Related posts

హుజూర్ నగర్ మున్సిపాలిటీని ఆదర్శవంతంగా తీర్చి దిద్దుకుందాం

Satyam NEWS

పెండింగ్ ఖాతాలను త్వరితగతిన పరిష్కరించాలి

Satyam NEWS

వనపర్తి జిల్లా ఎస్పీగా  రక్షిత కె మూర్తి

Satyam NEWS

Leave a Comment