39.2 C
Hyderabad
April 28, 2024 13: 04 PM
Slider నల్గొండ

హుజూర్ నగర్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా రెపరెప

#hujurnagar ysrtp

నియోజకవర్గ వ్యాపితంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఎగురవేయాలని, గ్రామ గ్రామాన పార్టీ బలోపేతం అయ్యేందుకు ప్రతి కార్యకర్త ఒక సైనికుడిలా పనిచేయాలని హుజూర్ నగర్ నియోజకవర్గ ఇంచార్జీ ఆదెర్ల శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో శనివారం వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ ఇంచార్జీ ఆదెర్ల శ్రీనివాస రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నూతన కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది.ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకులు పిట్టా రాంరెడ్డి,పార్టీ అధికార ప్రతినిధి భూమి రెడ్డి,నల్లగొండ జిల్లా కన్వీనర్ ఇంజం నర్సిరెడ్డి,కోదాడ కన్వీనర్ పచ్చిపాల వేణు యాదవ్,ఖమ్మం కన్వీనర్ ప్రతిభారెడ్డి, కోకన్వినర్ బీరఓలు శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధులుగా విచ్చేశారు.

ముందుగా పిట్టా రాంరెడ్డి రిబ్బెన్ కత్తిరించి పార్టీ కార్యాలయం ప్రారంభించారు.అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహానికి కార్యకర్తలతో కలసి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు.

రాష్ట్ర అధికార ప్రతినిధి భూమిరెడ్డి కంప్యూటర్ కార్యాలయం ప్రారంభించారు. ఆదెర్ల శ్రీనివాస రెడ్డి తన చేతుల మీదుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ జెండా ఆవిష్కరణ చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పత్రిక,మీడియా సమావేశంలో పిట్టా రాంరెడ్డి మాట్లాడుతూ మలిదశ ఉద్యమ వీరుల ప్రాణ త్యాగాలతో ఏర్పాటు జరిగిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నిధులు,నీళ్ళు,నియామకాలు అంటూ కెసిఆర్ గద్దెనెక్కి ఏడున్నర సంవత్సరాలు గడిచిన్నప్పటికి  తెలంగాణ ప్రజలు కలలుగన్న బంగారు తెలంగాణ ఏర్పాటు జరగక పోగా రాష్ట్రం అప్పుల పాలైందని ఆరోపించారు.భూమిరెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర పునాదులపై నిర్మించుకున్న దొరల కోటలను కూల్చే సమయం ఆసన్నమైందని,రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా వైఎస్ షర్మిల నాయకత్వంలో ఏర్పాటైన  వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమౌతుంది అన్నారు.

ఆదెర్ల శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ సంక్షేమం, సమానత్వం,స్వయం సమృద్ది అందించే లక్ష్యంతో వైఎస్ షర్మిల నాయకత్వంలో ఏర్పాటైన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రానున్న రోజుల్లో అధికారంలోకి రావడం  ఖాయమని అన్నారు.దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలను గుర్తు చేస్తూ మరల అలాంటి స్వర్ణయుగ పాలన కేవలం వైఎస్ షర్మిల కు మాత్రమే సాధ్యం అవుతుందని అన్నారు.పార్టీ అధినాయకురాలు షర్మిల అందించే ప్రోత్సాహంతో హుజూర్ నగర్ నియోజకవర్గ వ్యాపితంగా గ్రామ గ్రామాన,వాడవాడల వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ బలోపేతానికి కార్యకర్తల సలహాలు,సూచనలతో కృషి చేస్తానని అన్నారు.అనంతరం వివిధ పార్టీలకు చెందిన సుమారు 500 మంది వైఎస్ఆర్ తెలంగాణ పార్టీలో చేరారు.

ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు సుతారి శ్రీనివాస్,శాసనాల అంజి,ఆనెపు బ్రహ్మచారి,తోట కోటి,కంచర్ల అరవింద్ రెడ్డి,నున్న రామారావు,కందుల నరసింహ రెడ్డి,హాసన్,అహ్మద్,నాని, చింతాలపాలెం మండల నాయకులు దొండపాటి రాధా రెడ్డి, మేళ్ళచెరువు మండల నాయకులు శాగమ్ రెడ్డి కోటి రెడ్డి,గరిడేపల్లి మండలం నాయకులు గుండు గురవయ్య,వెంకటరెడ్డి, అరిగెల రవి,మఠంపల్లి మండల నాయకులు కస్నా నాయక్,బాబు నాయక్,వెంకటేశ్వర్లు, రవి,రవీందర్,వెంకటేష్,పాలకవీడు మండల నాయకులు జనార్ధన్ రెడ్డి,షాహిద్, కిషన్,రవీందర్ రెడ్డి,సుధాకర్ రెడ్డి,నేరెడుచర్ల మండల నాయకులు కర్రి సతీష్ రెడ్డి, చందు,నరేష్,గోవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

బాచిమంచి చంద్రశేఖర్, సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

దళారులను నమ్మి మోసపోవద్దు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్

Bhavani

రానా విరాట ప‌ర్వం ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌

Sub Editor

వనపర్తిలో సీఎం కేసీఆర్ కు పాలాభిషేకం

Satyam NEWS

Leave a Comment