33.2 C
Hyderabad
May 12, 2024 13: 10 PM
Slider విజయనగరం

“అసని” తుపాను ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్నాం

#suryakumaruias

“అసని” తుపాను ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉన్నామ‌న్నారు..ఏపీలోని విజ‌య‌న‌గ‌రం .జిల్లా క‌లెక్ట‌ర్ సూర్య‌కుమారీ. రాష్ట్ర విప‌త్తుల నివార‌ణ సంస్థ ఆదేశాలు,సూచ‌న‌ల‌తో జిల్లాయంత్రంగాఅంతా అలెర్ట్ గానే ఉన్నామ‌ని తెలిపారు. ఈమేర‌కు త‌న ఛాంబ‌ర్ లో విలేక‌రుల‌తో జిల్లా క‌లెక్ట‌ర్ మాట్లాడారు. “అసని” తుపాను ..దాని ప్ర‌భావం..తీసుకుంటున్న నివార‌ణ చ‌ర్య‌ల‌పై ఓ వైపు సీఎం జ‌గ‌న్..వీడియో కాన్ఫ‌రెన్స్ ల‌తో జాగ్ర‌త్త‌లు ఇస్తున్నార‌ని..అలాగే రాష్ట్ర విప‌త్తుల నివార‌ణ సంస్థ కూడా ఎప్ప‌టిక‌ప్పుడు సూచ‌న‌లు, తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల‌ను ముందుగానే చెప్పి..అలెర్ట్ చేస్తోంద‌న్నారు.

రాగ‌ల ప‌న్నెండు గంట‌లు… అలెర్ట్ గా ఉండాల‌ని…జిల్లాలో ఉన్న త‌హ‌శీల్దార్ల‌కు ఆదేశాలు ఇచ్చామ‌ని…సీఎం తో వీడియా కాన్ఫ‌రెన్స్ అనంత‌రం…అంద‌రి తహ‌శీల్దార్ల‌తో టెలీ కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించామ‌ని క‌లెక్ట‌ర్ చెప్పారు.ఇక అస‌ని తుపాను ప్ర‌భావం. జిల్లాలో త‌క్కువ‌గా ప‌డింద‌ని.. కొన్ని మండ‌లాల‌లో తుపాను ప్ర‌భావం తీవ్రంగా ఉంద‌న్నారు. ఇక పంట నష్టం విష‌యానికివ‌స్తే..అర‌టి మాత్ర‌మే ఈదురు గాలుల‌కు బాగా దెబ్బ‌తింద‌న్నారు.మూడు డిజ‌న్ల‌లో ఎక్క‌డిక్క‌డే కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేసి తుపాను ప‌రిస్థితిపై మోన‌టింగ్ చేస్తున్నామ‌న్నారు.

అయితే గత రాత్రి విద్యుత్ పోవ‌డంతో విజ‌య‌న‌గ‌రం లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ కు కాస్సేపు ప‌ని చేయ‌లేద‌న్నారు. ఇదిలా ఉంటే బంగాళాఖాతంలోఏర్ప‌డ్డ అస‌ని తీవ్ర‌తుపాను…తుపాను గా బ‌ల‌హీన ప‌డిన‌ట్టు విశాఖ వాతావ‌ర‌ణ‌కేంద్రం తెలిపింది.బుధ‌వారం ఉద‌యానికి వాయుగుండంగా తుపాను బ‌ల‌హీన ప‌డ‌నుంద‌ని పేర్కొంది.

గడిచిన 6 గంటల్లో గంటకు 6 కి.మీ వేగంతో పశ్చిమవాయువ్య దిశగా కదిలిందని… ప్రస్తుతం మచిలీపట్నంకు 50 కి.మీ., కాకినాడకు 150 కి.మీ., విశాఖపట్నంకు 310 కి.మీ., గోపాలపూర్ కు 530 కి.మీ., పూరీకు 640 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది.మ‌రికొద్ది గంటల్లో వాయువ్య దిశగా పయనించి ఆంధ్రప్రదేశ్ తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతం చేరుకునే అవకాశం ఉంటుందని తెలిపింది.

కాగా నరసాపురం వద్ద భూభాగంపైకి వచ్చే అవకాశం ఉంద‌ని…ఈ సాయంత్రానికి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోకి చేరుకునే అవకాశం ఉంద‌ని తెలిపింది.దీంతో కోస్తాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు…, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంద‌ని పేర్కొంది.

ఇక గురువారం…అంటే 12 వ‌తేదీన ఉత్తరాంధ్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అక్కడక్కడ భారీ నుంచి అతిభారీవర్షాలు పడే అవకాశం ఉంద‌ని…ఇక కోస్తాంధ్ర తీరం వెంబడి గంటకు 75-95 కిమీ వేగంతో ఈదురగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని. విప‌త్తుల నివార‌ణ సంస్థ కూడా పేర్కొంది

Related posts

సైకాలజిస్ట్ ఎడ్వయిజ్: కొడాలి నానికి ఎర్రగడ్డలో చికిత్స చేయించాలి

Satyam NEWS

మహాశివరాత్రి పండుగకు తెలంగాణ ఆర్టీసీ ఏర్పాట్లు

Sub Editor 2

మంత్రి పువ్వాడ వాహనo తనిఖీ

Satyam NEWS

Leave a Comment