30.7 C
Hyderabad
May 5, 2024 04: 40 AM
Slider గుంటూరు

ఓటు ద్వారా మోడీ ప్రభుత్వానికి బుద్ది చెప్పాలి

#narasaraopetbundh

గత పది నెలలుగా ఎండనకా, వాననకా పోరాడుతున్న రైతులకు న్యాయం చేయాల్సింది పోయి  మోడీ ప్రభుత్వం శత్రుసేనలపై దాడి చేసినట్లు దేశానికి అన్నం పెట్టే రైతుల పట్ల అత్యంత దారుణంగా వ్యహరిస్తుందని అఖిల పక్షం నేతలు పేర్కొన్నారు. సోమవారం భారత్ బంద్ కు సుమారు ఐదు వందల రైతు సంఘాలు పిలుపులో భాగంగా నరసరావుపేట పట్టణంలో బీజేపీ మినహా అన్ని రాజకీయ పార్టీలు భారత్ బంద్ కు మద్దతు ఇచ్చాయి. వర్షం సైతం లెక్క చేయకుండా తెలవారుజాము నుండే మధ్యాహ్నం రెండు గంటల వరకు ర్యాలీ గా బయలుదేరి నిరసన తెలిపారు. దారి పొడుగునా రైతాగ్గా కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని,దేశ సంపదను కాపాడాలని, మూడు వ్యవసాయ నల్ల చట్టాలను   రద్దు చేయాలని, గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించాలని,దారి పొడుగునా పలు నినాదాలు చేశారు.

ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ఓటు ద్వారా బుద్ది చెప్పాలని  పట్టణంలో విద్యా, వాణిజ్య వ్యాపార సంస్థలు బంద్ కు స్వచ్చద్దం గా సహకరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహమ్మద్, ఎల్.ఐ.సి ఏజెంట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఈవూరి మస్తాన్ రెడ్డి, సమైక్య ఆంధ్రప్రదేశ్ ముస్లిం జేఏసీ రాష్ట్ర కన్వీనర్ యస్ కె. జిలానిమాలిక్,సీఐటీయూ జిల్లా కార్యదర్శి డి. శివకుమారి,పశ్చిమ గుంటూరు జిల్లా కౌలు రైతు అధ్యక్షులు కామినేని రామారావు,సీపీఐ జిల్లా కార్యదర్శి కాసా రాంబాబు,

సీఐటీయూ మండల కార్యదర్శి షేక్ శిలార్ మసూద్,బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ నరసరావుపేట పట్టణ కార్యదర్శి కాసు కోటి రెడ్డి, పీ.డీ.యం. నాయకులు రామకృష్ణ, సీపీఎం నాయకులు పి. మస్తాన్ వలి,నరసరావుపేట ఏరియా సీపీఐ కార్యదర్శి ఉప్పలపాడు రంగయ్య, నరసరావుపేట ఏరియా ఏఐటీయూసీ కార్యదర్శి వైధన వెంకట్, ప్రజా నాట్యమండలి నాయకులు పెద్ది రాజు,షేక్.చిన్నా సైదా, ప్రగతి శీల కార్మిక సమైక్య సంఘం అధ్యక్షుడు కంబాల కొండలు, చైతన్య గ్యాస్  వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు దాసరి శ్రీనివాసరావు సెక్రెటరీ వెంకట్ రెడ్డి ,మడలనేని చలపతి రావు, బంగారు బాబు ,వి.వెంకటేశ్వర్లు ,రవికుమార్ , చందు,

పెట్రోల్ బంక్ వర్కర్స్ యూనియన్ నాయకులతో పాటు నరసరావుపేట టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు, తెలుగు రైతు రాష్ట్ర అధికార ప్రతినిధి గొట్టిపాటి జనార్దన్ బాబు,కొట్టా కిరణ్, కుమ్మేత కోటి రెడ్డి, సంపత్,  సీపీఐ,సీపీఎం,ఎంఐఎం,తెలుగుదేశం,జేఏసీ, వివిధ ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల అక్రమ రవాణా నిరోధక వారోత్సవాలు

Satyam NEWS

ఫైటింగ్ స్పిరిట్: క‌రోనాను నిర్మూలించే వ‌ర‌కు ఈ యుద్ధం ఆగొద్దు

Satyam NEWS

పోలీసు కార్యాలయాల్లో కరోనా రక్షణ చర్యలు

Satyam NEWS

Leave a Comment