38.2 C
Hyderabad
May 1, 2024 21: 43 PM
Slider హైదరాబాద్

కెసిఆర్ సారు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఎప్పుడిస్తరు?

#nvsprabhakar

అర్హులైన  పేద, బడుగు బలహీన వర్గాల ప్రజలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు కేటాయించాలని రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ శాసనసభ్యులు డాక్టర్ ఎన్విఎస్ఎస్ ప్రభాకర్  ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా  ప్రజల కోసం , ప్రగతి కోసం, పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు డబుల్ బెడ్ రూములు కేటాయించాలని  బుధవారం ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్  చేపట్టిన ప్రభాకర్ మార్చు కు ప్రజలు పెద్ద ఎత్తున  బ్రహ్మరథం పట్టారు.

ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ లోని రాధిక థియేటర్ చౌరస్తా నుండి కాప్రా మున్సిపల్ ఆఫీస్ వరకు ప్రజలు పెద్ద ఎత్తున ప్రభాకర్ మార్చు కు  సంఘీభావం తెలిపి పాదయాత్రగా కాప్రా మున్సిపల్ ఆఫీస్ ముందు చేరుకొని ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్య‌క్షుడు    ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ మాట్లాడుతూ సీఎం  కేసీఆర్‌  డ‌బుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరిట ప్ర‌జ‌ల‌ను మ‌భ్య‌పెడుతున్నార‌ని ఆయ‌న ఆరోపించారు.

ఇరుకైన ఇంట్లో ఆలుమగలు కాపురం చేయడమే కష్టం..అల్లుడు బిడ్డా వస్తే తలదాచుకునేదెలా..? గత ప్రభుత్వాలు ఇరుకైన ఇండ్లు పేదలకు ఇచ్చింది..  టీఆర్ఎస్ అధికారంలోకి రాగానే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించి ఇస్తాం.. అని 2014, 2018 ఎన్నికల ప్రచారసభల్లో మీరు హామీ ఇచ్చిన మాట వాస్తవం కాదా..?  అని ప్ర‌శ్నించారు.

2014 ఎన్నికల సందర్భంగా మీరు విడుదల చేసిన మ్యానిఫెస్టోలో పేజీ 14లో బలహీన వర్గాలకు గృహ నిర్మాణం అనే అంశం కింద ‘‘ఇల్లు లేని నిరుపేదలకు 125 గజాల స్థలంలో 3 లక్షల రూపాయల వ్యయంతో రెండు పడక గదులు, ఒక హాలు, ఒక వంటగది, స్నానాల గది, మరుగుదొడ్డి ఉన్న ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇస్తుందని మీరు హామీ ఇచ్చారు. ఈ ఏడు సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో ఎన్ని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మించారు? ఎంత మంది  పేదలకు ఇచ్చారు? పేద ప్రజలకు సమాధానాలు  తెలపాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో హబ్సిగూడ డివిజన్ కార్పొరేటర్ కక్కిరేణి చేతన హరిష్ ,రామంతాపుర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకట్ రావు ,ఓబిసి మోర్చ రాష్ట్ర అధికార ప్రతినిధి వేములకొండ సొమశేఖర్,  సంజయ్ పటేల్ బొమ్మగోని రఘపతి గౌడ్, పూజారి సోమయ్య గౌడ్, డివిజన్ ప్రధాన కార్యదర్శులు చెల్లోజు ఎల్లాచారి, చింతకింది ప్రవీణ్, ధారం వెంకటేష్ గుప్త, నోముల శాంతికుమార్, ఆశాజీ,ఎవి చారి ,కుంభం శ్రీనివాస్,గ్యార రవీందర్,పాశం ప్రవీణ్, కట్ట భాస్కర్, సుధాకర్, భాస్కర్, కలీద్,పుచ్చల అశోక్, ముషిగంపల శివ గౌడ్ తదతరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

ప్రపంచ సినిమా చూపు తెలుగు సినిమా వైపు

Satyam NEWS

‘క్ష‌ణం క్ష‌ణం’ ఉత్కంఠ రేపే చిత్రంః హీరో ఉద‌య్ శంక‌ర్

Satyam NEWS

పీఆర్టీయూ సభ్యత్వ నమోదు కార్యక్రమం

Satyam NEWS

Leave a Comment