33.7 C
Hyderabad
April 29, 2024 00: 56 AM
Slider ఆధ్యాత్మికం

ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత జాతరకు అంతా సిద్ధం

#PolamambaJatara

ఉత్తరాంధ్ర గిరిజన ఆరాధ్య దేవత, కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి శంబర పోలమాంబ జాతర సమీపించడంతో గ్రామానికి పండగ శోభ సంతరించుకుంది. విజయనగరం జిల్లా సాలూరు మండలం శంబర పోలమాంబ జాతరకు సర్వం సిధ్ధమైంది. కరోనా నిబంధనలతో దేవాదాయ శాఖ ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జాతరను పురస్కరించుకొని దేవాదాయ ధర్మాదాయ శాఖ అమ్మవారి దేవాలయాలతో పాటు భక్తులను కనువిందు చేసేందుకు విద్యుత్ కాంతులతో శోభాయమానంగా వనం గుడి, చదురు గుడి యాత్ర ప్రదేశాలలో ప్రత్యేక విద్యుత్ కాంతులతో ప్రకాశిస్తూ అందరినీ ఆకర్షస్తోంది.

కోవిడ్ నిబంధనలతో ఏర్పాట్లు

అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు కోవిడ్ నిబంధనలు పాటించాలి ప్రతి ఒక్కరూ తప్పక మాస్క్ ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఉండే విదంగా జాతరకు వచ్చే భక్తులకు ఆవగాహన కల్పించేందుకు సంబంధిత శాఖలతో అవగాహన కల్పించేందుకు ప్రధాన కూడలి లో కోవిడ్ నిబంధనలు తెలిపే విధంగా ఫ్లెక్సీలు, శానిటేజర్లు ఏర్పాటు చేశారు. అలాగే మాస్కుల పంపిణీకి చర్యలు చేపడుతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాట్లను పూర్తి చేశారు, విద్యుత్ శాఖ విద్యుత్ కు అంతరాయం కలుగకుండా ఉండేందుకు జనరేటర్ సిద్ధం చేసుకున్నారు.    

పారిశుధ్యం పై ప్రత్యేక ప్రణాళిక

శంబర జాతర సందర్భంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ పంచాయతీ స్వీపర్స్,  మొత్తం 27 బృందాలుగా ఏర్పడి 27 పర్యవేక్షణా ప్రాంతాలను ఏర్పాటు చేసుకొని నిరంతరం  పారిశుధ్య పై ప్రత్యేక దృష్టి సారిస్తు మెరుగైన పారిశుధ్య అందించేందుకు సిద్ధంగా ఉంది.

భక్తులకు అసౌకర్యం కలుగ కుండా ప్రత్యేక ఏర్పాట్లు

పార్వతీపురం సబ్ కలెక్టర్ విధే ఖర్, ఐటీడీఘ ప్రాజెక్ట్ అధికారి ఆర్.కూర్మనాథ్ వారి సూచనలు, సలహాలు పాటిస్తూ   యంత్రాంగం ఎప్పటి కప్పుడు ఆన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ప్రధానంగా క్యూ లైన్లు ఏర్పాటు. దర్శనానికి వచ్చిన భక్తులకు ఏటువంటి ఇబ్బందులు లేకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. క్యూ లైన్లు ఉన్న వారికి త్రాగునీరు అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అలాగే భక్తులకు ప్రసాదం అందించు నిమిత్తం దేవాదాయ శాఖ ప్రత్యేక కౌంటర్ల సిద్ధం చేసుకున్నారు.

జాతరకు 600 మంది పోలీసులతో బందోబస్తు

శంబర పోలమంబ అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా 600 మంది పోలీసు అధికారులు సిబ్బంది తో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Related posts

గిరిజనేతరులకు పోడు పట్టాలు ఇప్పిస్తాం : సీఎం కేసీఆర్‌

Satyam NEWS

ప్రజాపాలన దరఖాస్తు కేంద్రం ఆకస్మిక తనిఖీ

Satyam NEWS

ప్రియాంకా గాంధీ కి చోటు కాంగ్రెస్ పార్టీకి చేటు

Satyam NEWS

Leave a Comment