40.2 C
Hyderabad
April 29, 2024 17: 33 PM
Slider విజయనగరం

ప్రశాంత వాతావరణంలో పంచాయితీ ఎన్నికల నిర్వహణ

#VijayanagaramPolice

విజయనగరం జిల్లాలో ప్రశాంతయుతంగా పంచాయతీ ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో పని చేస్తున్న డీఎస్పీలు, సీఐలతో సమీక్షా సమావేశాన్ని జిల్లా ఎస్పీ రాజకుమారి నిర్వహించారు. ఈ సందర్భంగా

జిల్లా ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ – విజయనగరం జిల్లాలో పార్వతీపురం రెవెన్యూ డివిజన్ లో ఫిబ్రవరి 13న, విజయనగరం రెవెన్యూ డివిజన్ లో ఉన్న పంచాయితీలకు ఫిబ్రవరి 17న పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయన్నారు.

ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన వారిపై తప్పని సరిగా కేసులు నమోదు చేయాలన్నారు. పార్టీలకు అతీతంగా వ్యవహరించాలని, నిష్పక్షపాతంగా పని చేయాలని, ఎన్నికలను ప్రశాంతయుతంగా నిర్వహించే విధంగా చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

పోలీసు స్టేషనుల్లో ఉండే ప్రభుత్వ ప్రకటనలు, ఫోటోలను తొలగించాలన్నారు. జాతీయ నాయకుల విగ్రహాలు మినహా గ్రామాల్లో ఉండే రాజకీయ నాయకుల విగ్రహాలకు రెవెన్యూ, పంచాయతీ అధికారులు ముసుగులు వేసే విధంగా చూడాలన్నారు.

ఏకగ్రీవాల పేరుతో ప్రలోభాలు వద్దు

ఎన్నికల ప్రచారాలను ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వరకు మాత్రమే నిర్వహించే విధంగా చూడాలన్నారు. బహిరంగ సభలు, మైకులు, ప్రచార వాహనాలకు తప్పనిసరిగా సంబంధిత డిఎస్పీల నుండి అనుమతులు పొందాలన్నారు.

పంచాయతీల్లో ఏకగ్రీవ ఎన్నికలకు ఎవ్వరూ ప్రలోభ పెట్టకుండా చూడాలన్నారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అత్యవసర పరిస్థితుల్లో మినహా పోలీసు అధికారులు, సిబ్బందికి సాధారణ సెలవులు, పెర్మిషన్లు నిలిపివేయాలని, ఎన్నికల విధులకు పోలీసు సిబ్బంది అందరూ సమాయత్తం అయ్యే విధంగా చూడాలన్నారు. రాత్రి 10 తరువాత ఎటువంటి ప్రచారాలు నిర్వహించకుండా చర్యలు చేపట్టాలన్నారు.

ప్రశాంతత కాపాడేందుకు పటిష్ట చర్యలు

ఎన్నికల ముందు పోలీసు అధికారులు సమర్ధవంతంగా వ్యవహరించగలిగితే ఎన్నికల రోజునా, ఎన్నికల తరువాత ఎటువంటి తగాదాలు, గొడవలు జరగకుండా, ప్రశాంతంగా ఎన్నికలను నిర్వహించవచ్చన్నారు, కావున, ప్రతీ ఒక్కరూ ఈ దిశగా చర్యలు చేపట్టాల్సిందిగా పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఆదేశించారు.

అనధికార మద్యం అమ్మకాలు, డబ్బుల పంపిణీ జరగకుండా చర్యలు చేపట్టాలన్నారు. వాహనాల తనిఖీలను, నాకాబందీలను ఎప్పటికప్పుడు నిర్వహించాలన్నారు. సబ్ డివిజను, సర్కిల్ స్థాయిలో ఎన్నికల సమాచారాన్ని తక్షణమే అందించేందుకు ప్రత్యేక సెల్ లను ఏర్పాటు చేయాలన్నారు.

గ్రామాల్లో అల్లర్లు సృష్టించేందుకు అవకాశం ఉన్న వ్యక్తులను ముందుగా గుర్తించి వారిని బైండోవరు చేయాలన్నారు. రౌడీ షీటర్సును, గత ఎన్నికల్లో ముద్దాయిలుగా ఉన్న వారిపై నిఘా పెంచాలని, వారిని బైండోవరు చేయాలని పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. పంచాయితీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని లైసెన్స్ ‘ తుపాకులు కలిగిన వారి తుపాకులను పోలీసు స్టేషనుల్లో డిపాజిట్ అయ్యే విధంగా చూడాలన్నారు. 

కోర్టులు జారీ చేసిన నాన్ బెయిలబుల్ వారంటును ఎగ్జిక్యూట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వారంటుదారులను అరెస్టు చేసి, తిరిగి కోర్టులో హాజరుపర్చాలని సిబ్బంది ని  ఎస్పీ  ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎస్ఈ బి అదనపు ఎస్పీ ఎన్. శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఒఎస్టీ ఎన్. సూర్యచంద్రరావు, బొబ్బిలి డీఎస్పీ బి.మోహనరావు, పార్వతీపురం డిఎస్పీ ఎ. సుభాష్, సీసీఎస్ డీఎస్పీ జె.పాపారావు, ట్రాఫిక్ డీఎస్పీ ఎల్.మోహనరావు, దిశా మహిళా ఏఎస్ డీఎస్పీ టి.త్రినాధరావు, ఏఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి,

 సీఐలు బి.వెంకటరావు, ఎన్.శ్రీనివాసరావు, రుద్రశేఖర్, డి.రమేష్, జె.మురళి, సిహెచ్.శ్రీనివాసరావు, టిఎస్ మంగవేణి, జి. గోవిందరావు, శ్రీధర్, జి.సంజీవరావు, ఎస్.సింహాద్రినాయుడు, శోభన్ బాబు, ఈ. కేశవరావు, సిహెచ్. లక్ష్మణరావు, టివి తిరుపతిరావు, రాజశేఖరరావు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Related posts

బాబాయి హత్య కేసులో సీబీఐ నోటీసులపై స్పందించిన అవినాష్….

Satyam NEWS

చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి తెలీదు

Satyam NEWS

కలుషిత గణేష్ ప్రసాదం తిని పిల్లల అస్వస్థత

Satyam NEWS

Leave a Comment