37.2 C
Hyderabad
April 30, 2024 13: 02 PM
Slider వరంగల్

ప్రజాపాలన దరఖాస్తు కేంద్రం ఆకస్మిక తనిఖీ

#ilatripathi

ప్రజా పాలన అభయ హస్తం 6 గ్యారంటీల దరఖాస్తుల సమర్పణ పై ఆందోళన వద్దు అని ములుగు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. గురువారం తాడ్వాయి మండలం లోని వెంగలపూర్ గ్రామ పంచాయితీ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన దరఖాస్తు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం  అంత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని ఈ రోజు నుండి డిసెంబర్ 28 నుండి జనవరి 6 వరకు వారం రోజుల పాటు దరఖాస్తుల స్వీకరించబడునని తెలిపారు. (డిసెంబర్ 31,జనవరి 1 సెలవు రోజులు మినహా) అభయహస్తం 6 గ్యారంటీల కొరకు  కుటుంబం నుండి ఒకే దరకాస్తూ మాత్రమే సమర్పించాలని అన్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం గడప గడప కు వెళ్లి దరఖాస్తు ఫారాల, అందజేయడం జరుగుతుందని,  స్వీకరణ ఉండదని, గ్రామాల్లో ఏర్పాటుచేసిన కౌంటర్లలో దరఖాస్తులు సమర్పించి, రసీదు పొందాలని పేర్కొన్నారు.

రేషన్ కార్డు  ఉంటేనే దరఖాస్తు చేయాలి అనే నిబంధన  లేదు, ఆధార్ కార్డ్ జిరాక్స్ ద్వారా కూడా అప్లయ్ చేసుకోవచ్చు, వదంతులు నమ్మి ప్రజలు ఆందోళన చెందవద్దు, అందజేసే ప్రతి దరఖాస్తు ను స్వీకరిస్తామని అన్నారు.  ప్రతి ఒక్కరూ దరఖాస్తు లు చేసుకోవాలని అన్నారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరూ దరఖాస్తు  రశీదు, దరఖాస్తు నంబర్ భద్రపరచుకోవాలని తెలిపారు. ప్రస్తుతం గ్రామాలలో లేని వారికోసం ప్రతి నాగులు నెలలకు ఒకసారి దరఖాస్తు లు తీసుకోవడం జరుగుతుందని ఎవరు అదైర్యపడవద్దని అన్నారు. ప్రజల నుంచి తీసుకున్నా   దరఖాస్తులను అధికారులు జాగ్రతగా భద్రపరచాలని అధికారులకు సూచించారు. నిరక్షరాస్యల కు అధికారులే దరఖాస్తు ఫారం నింపాలని , రేషన్ కార్డులు లేనివారి కోసం ప్రత్యేక కౌటర్స్ ఏర్పాటు చేసి దరఖాస్తులు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో  మండల ప్రత్యేక అధికారి డి ఎం అండ్ హెచ్ ఓ డా.అప్పయ్య, విద్యుత్ శాఖ  డి ఈ నాగేశ్వరరావు, కార్యదర్శి నర్మద, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

జైలా? బెయిలా?: సీబీఐ కోర్టు ఆదేశాలపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ

Satyam NEWS

డప్పు కళాకారుల సంఘం నేతకు టీడీపీ నివాళి

Satyam NEWS

క‌రోనా నివార‌ణ‌కు న‌గ‌రంలో మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ ర్యాలీ….!

Satyam NEWS

Leave a Comment