38.2 C
Hyderabad
May 5, 2024 20: 12 PM
Slider మెదక్

దుబ్బాక అసెంబ్లీ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం

#DubbakaElections

దుబ్బాక అసెంబ్లీ స్థానంలో జరుగుతున్న ఉప ఎన్నిక పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మంగళవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 6 గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.

నియోజకవర్గంలో మొత్తం లక్ష 98 వేల 807 మంది ఓటర్లుండగా వారిలో లక్ష 779 మంది మహిళా ఓటర్లు, 98 వేల 28 పురుషులు ఉన్నారు. మొత్తం 315 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి బూత్‌లో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ ఓటు హక్కును వినియోగించుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు.

ప్రతి ఓటరుకూ గ్లౌజెస్ ఇవ్వడంతో పాటు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయనున్నారు. కరోనా రోగులు కూడా సాయంత్రం 5 నుంచి 6 గంటల మధ్యలో పీపీఈ కిట్లతో వచ్చి ఓటువేసే అవకాశం కల్పించారు. ఓటరుకు ఓటరుకు మధ్య 5 మీటర్ల భౌతిక దూరం, వీల్‌ఛైర్లు, గర్భిణులు, దివ్యాంగులకు ప్రత్యేక లైన్లు ఏర్పాటుచేస్తున్నారు.

Related posts

జుక్కల్ కస్తూర్బ సిబ్బంది కి ఘనంగా సన్మానం

Satyam NEWS

డీజీపీ వ్యాఖ్య‌ల‌ను ఖండించిన ఉత్త‌రాంద్ర బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

Satyam NEWS

కోర్టు ధిక్కారం: ఇద్దరు ఐఏఎస్ అధికారులకు జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment