38.2 C
Hyderabad
April 29, 2024 13: 36 PM
Slider నిజామాబాద్

నియంత్రిత పంటల విధానంపై తీర్మానించిన తొలి గ్రామం

#MLA Jajula Surender

నియంత్రిత పంటల విధానాన్ని సమర్థిస్తూ తెలంగాణ లో మొట్టమొదటి సారిగా కామారెడ్డి జిల్లాలోని ఒక గ్రామ పంచాయితీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం కొర్పోల్ గ్రామ రైతులు సీఎం కేసీఆర్ సూచన మేరకు ప్రభుత్వం చెప్పిన విధంగా పంటలు వేయడానికి ఏకగ్రీవ తీర్మానం చేశారు.

ఆ తీర్మానం కాపీని ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే జాజాల సురేందర్ కు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల శ్రేయస్సు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయాలు తీసుకుంటారని అన్నారు. డిమాండ్ కు తగిన పంటలు వేయడం ద్వారా రైతులు లాభాల బాటలో పయనిస్తారని చెప్పారు.

రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. త్వరలోనే కాళేశ్వరం నీరు ఈ ప్రాంతానికి రానున్నాయని, ఆ నీటి ద్వారా ఇక్కడి భూములన్నీ సస్యశ్యామలం అవుతాయన్నారు. జిల్లాలోనే మొట్టమొదటి తీర్మానాన్ని కొర్పోల్ గ్రామ రైతులు చేయడం అభినందనీయమన్నారు.

ఈ సందర్బంగా రైతులకు ఎమ్మెల్యే ధన్యవాదాలు తెలిపారు. లాభసాటి పంటలు వేయడం ద్వారా రైతులకు లబ్ది చేకూరుతుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు రైతుల సంక్షేమం గురించి ఇంతలా ఆలోచించి నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు లేవన్నారు.

రైతులు లాభం పొందాలన్న ఆలోచనతోనే మొక్కజొన్న పంటను వేయొద్దని సీఎం సూచించారన్నారు. మొక్కజొన్న పంటలు పూర్తిగా వద్దని చెప్పలేదన్నారు. అవకాశం ఉన్నచోట సన్నరకం వరి వేయాలని సూచించారు. రేపటి రైతు భవిష్యత్తు బంగారు మయం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని చెప్పారు.

గత ప్రభుత్వాల హయాంలో విద్యుత్ కోసం ఆందోళనలు చేసి పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేదన్నారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని చెప్పారు. రైతు బిడ్డగా రైతుల సంక్షేమం కోసమే నిరంతరం పరితపించే గొప్ప వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ అని కొనియాడారు.

కరోనా లాంటి ప్రమాదకరమైన వైరస్ ప్రభావం ఉన్నా ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయకున్నా రైతులే మంచి ధర వచ్చేలా విక్రయించుకునే విధంగా సన్నరకం వరి పండించాలని చెప్పారని అన్నారు. ఈ విషయాన్ని రైతులు అర్థం చేసుకోవాలని కోరారు.

Related posts

టీఆర్ఎస్ నాయకులను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలి

Satyam NEWS

తారకాసుర తో విజయ్ భాస్కర్ రెడ్డి పాల్యం విజయ దుందుభి మ్రోగించాలి

Satyam NEWS

తొలి కేసును చేధించిన సైబ‌ర్ క్రైమ్ పోలీసులు…!

Satyam NEWS

Leave a Comment