42.2 C
Hyderabad
April 30, 2024 17: 58 PM
Slider ఖమ్మం

 ప్రత్యామ్నాయంగా ఆమ్ ఆద్మీ               

#aap

గుజరాత్ ఎన్నికలలో విజయం సాధించి ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ ప్రత్యామ్నాయం గా మారుతుందని ఆఫ్ జిల్లా కన్వినర్ నల్లమోతు తిరుమల రావు పేర్కొన్నారు.  ఖమ్మం రోటరీనగర్ లోని ఆప్ జిల్లా కార్యాలయంలో జరిగిన వాలెంటీర్ల సమావేశంలో ఆయన ప్రసంగించారు. 2024నాటికి బిజేపి ఫాసిస్టు పరిపాలన ఎదిరించే స్థాయిలో ఆప్ విస్తరణ జరుగుతుందని, ఆప్ పార్టీ నాణ్యమైన ఉచిత విద్య, ఉచిత వైద్యం, 300యూనిట్ల విద్యుత్ వినియోగదారులకు జీరో బిల్లు, మహిళలు, భవన నిర్మాణ కార్మికులు, విద్యార్థులు కు ఉచిత ప్రయాణ సౌకర్యం, నిరుద్యోగులకు ఉద్యోగం, ఉపాధి కల్ఫనావిదానాలు, రైతాంగం పంటలకు గిట్టుబాటు ధర లాంటి ఆప్ విధానాలు ప్రజల్ని ఆకర్శిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు ఓల్డు పెన్షన్ విధానం అమలు ఆప్ లక్ష్యం లో ఒకటిగా ఉందన్నారు. ఆప్ మాత్రమే బిజేపి కి విధానపరమైన ప్రత్యామ్నాయం గా ముందుకు వచ్చిందని అన్నారు. ఈకార్యక్రమానికి ఆప్ పట్టణ కన్వినర్ యండి. గఫార్ అద్యక్షత వహించారు. వాలెంటీర్ల సమావేశంలో ఆప్ ఖమ్మం పట్టణం కన్వినర్ యండి గఫూర్  ఆధ్వర్యంలో ఖమ్మం రిక్కాబజార్ కు చెందిన యస్ కే ఖాదర్, జీ వెంకటేశ్వరరావు ఆప్ లో చేరారు.

Related posts

ఎస్.పి. మృతికి తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం సంతాపం

Satyam NEWS

పేరిణి నృత్యానికి జాతీయ స్థాయి గుర్తింపు రావాలి

Satyam NEWS

రేపు శ్రీకాకుళం ఆరంగి వీధిలో సీతారాముల కల్యాణోత్సవం

Satyam NEWS

Leave a Comment