ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి బారి నుండి ప్రజలను రక్షించాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేయడంతో బిచ్కుంద మండల అధికారులు గ్రామాల బాట పట్టారు. తహశీల్దార్ వెంకట్రావు బండ రెంజల్ గ్రామంలో పర్యటించగా బిచ్కుంద మండల కేంద్రంలో ఎంపిడిఓ ఆనంద్ కందర్పల్లి గ్రామంలో ఎంపీఒ మహబూబ్ లు పర్యటించి గ్రామాలలో ప్రజలందరికీ అప్రమత్తత చేస్తున్నారు.
జన సంచారం అధికం ఉన్న చోట ప్రజలు ఉండరాదు అని వారు ప్రజలతో అంటున్నారు. వ్యక్తి శుభ్రతే శ్రీరామ రక్ష అని ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలన్నారు. ఆదివారం జనతా కర్ఫ్యూ పట్ల అందరూ విజయవంతం చేయాలని ఎవరూ కూడా ఇంటి నుండి బయటకు రాకూడదని అన్నారు. చిన్నపిల్లలు వృద్ధులకు పట్ల ఎటువంటి అశ్రద్ధ చూపరాదన్నారు.
ప్రతి ఒక్కరు మాస్కులు ధరించి తమ వ్యాపారాలను వ్యవహరాలను కొనసాగించాలన్నారు. ఈ కార్యక్రమాలలో మండల స్థాయి అధికారులతో పాటు ఆయా గ్రామాల సర్పంచ్లు ప్రజాప్రతినిధులు పంచాయతీ కార్యదర్శులు మండల అధికారులు పాల్గొన్నారు.