31.2 C
Hyderabad
May 3, 2024 02: 21 AM
Slider నల్గొండ

భావి భారత పౌరులకు అంబేద్కర్ ఆదర్శం

ambedkar -1

ప్రపంచ మేధావి భారతరత్నభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ 64వ, వర్ధంతి సందర్భంగా సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో డి.ఎస్.ఆర్. ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు భావిభారత పౌరులచే (చిన్నారుల‌తో) అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేయించి ఘనంగా నివాళులు అర్పించారు.

అనంతరం దగ్గుపాటి బాబురావు భీంరావ్ రాంజీ అంబేడ్కర్ 1891 ఏప్రిల్ 14న, జన్మించారని, లండన్, ముంబై, కొలంబియా విశ్వవిద్యాలయాలలో విద్యను అభ్యసించారని, ప్రముఖ భారతీయ న్యాయవాదని, ఆర్ధిక శాస్త్రవేత్త, రాజకీయ నేత, సంఘ సంస్కర్త అని, దళితులపై అంటరానితనాన్ని, కుల నిర్మూలన కోసం ఎంతో కృషిచేసిన వ్యక్తని కొనియాడారు.

భారతదేశపు మొట్టమొదటి కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేసిన ఘ‌న‌త ఆయ‌న‌కే సొంత‌మ‌న్నారు. భారత రాజ్యాంగ శిల్పిగా చరిత్ర పుటల్లో సువర్ణాక్షరాలతో లిఖించబడిన వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. అలాంటి మ‌హానీయుడు 1956 డిసెంబర్ 6న స్వ‌ర్గ‌స్థుల‌య్యార‌ని, ఎంతో ఉన్నత ఆశయాలు కలిగిన వ్యక్తి కనుక నేటి భావి భారత పౌరులకు ఆయన ఆదర్శం కావాలని, అంబేద్కర్ జీవిత చరిత్రను బాల‌ల‌కు వివరించారు.

ఈ కార్యక్రమంలో దగ్గుపాటి సూర్య రానా, కోల్లపూడి తేజ, కోలపూడి అఖిల, తమన్, మామిడి ప్రవళిక, మామిడి ఇందు, మామిడి లక్కీ, తంసి, నితీష్, మహేష్, లచ్చి మల్ల వరుణ్ తేజ త‌దితరులు పాల్గొన్నారు.

Related posts

గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన సింగరేణి డైరెక్టర్

Satyam NEWS

సినీ హీరోయిన్ కుష్బూ కంటికి గాయం

Satyam NEWS

జపాన్ లో ప్రవాసులపై మోడీ సమ్మోహనాస్త్రం

Satyam NEWS

Leave a Comment