37.2 C
Hyderabad
May 6, 2024 22: 58 PM
Slider నల్గొండ

సిఐటియు ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి

#citu

ప్రపంచంలోనే నేనే పెద్దన్న అనే అమెరికాలో ఆ రోజుల్లో మహిళలకు ఓటు హక్కు లేదని,డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నిర్మించిన రాజ్యాంగంలో మహిళలకు ఓటు హక్కుతో పాటు అన్ని వెనుకబడిన వర్గాలకు సమాన హక్కులు ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని సి ఐ టి యు జిల్లా ఉపాధ్యక్షుడు శీతల రోషపతి కొనియాడారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో దళితవాడలో బి.ఆర్.అంబేద్కర్ 131 జయంతి ఘనంగా జరుపుకున్న సందర్భంగా రోషపతి మాట్లాడుతూ స్వాతంత్రం సిద్ధించిన తర్వాత రాజ్యాంగ నిర్మాణ కమిటీకి అధ్యక్షుడిగా బి ఆర్ అంబేద్కర్,(రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు )శ్రమించి రాజ్యాంగాన్ని నిర్మించి ఎనలేని కృషి చేశారని అన్నారు.

కానీ ఇప్పటికీ అంటరానితనం,కుల బహిష్కరణలు ఏం తినాలి,ఏమి తినకూడదు అనే సామాజిక సమస్యలు నేటికి ఇప్పుడున్న కేంద్ర బిజెపి ప్రభుత్వంలో ఇప్పటికే కొన్ని గ్రామాల్లో,రాష్ట్రాలలో,పనిచేసే చోట్ల కొట్టొచ్చినట్టు కనబడటం దురదృష్టకరమైన విషయమని అన్నారు. రాష్ట్రంలో దళిత బంధు వలన కెసిఆర్ రాష్ట్ర మున్సిపల్ కార్మికులలో దళితులు 50 నుంచి 70 శాతం ఉంటారని,రాష్ట్ర మున్సిపాలిటీలలో ఉన్న కార్మికులను అందరినీ పర్మినెంట్ చేయాలని కోరారు.

దళిత బంధు రాష్ట్రంలో ఉన్న దళితులు అందరికీ వర్తింపజేయాలని కోరారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం పెట్రోల్, డీజిల్,వంట గ్యాస్ ధరలు విపరీతంగా పెంచిందని,దీనికి పోటీగా రాష్ట్రంలోని కెసిఆర్ ప్రభుత్వం విద్యుత్ చార్జీలు,బస్ చార్జీలు పెంచటం దురదృష్టకరమని అన్నారు.పెంచిన పెట్రోల్,డీజిల్, వంటగ్యాస్,విద్యత్,బస్సు చార్జీలు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రభుత్వం తగ్గించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు,వివిధ కార్మిక సంఘాల నాయకులు,కస్తాల ముత్తమ్మ,మెరగ దుర్గారావు,ఉపతల వెంకన్న,పి.రాజు, కస్తాల సైదులు,రవి,గోపి,చంద్రకళ, కోటమ్మ,వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

స్వేచ్ఛ ఉమెన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో కరోనా వీరులకు ఉత్తమ సేవా పురస్కారాలు

Satyam NEWS

ప్రారంభానికి సిద్దమైన వైద్య కళాశాల

Bhavani

బాబుకు షాక్: ఎమ్మెల్సీ పదవికి డొక్కా రాజీనామా

Satyam NEWS

Leave a Comment