29.7 C
Hyderabad
May 2, 2024 05: 23 AM
Slider ఖమ్మం

ప్రారంభానికి సిద్దమైన వైద్య కళాశాల

#Medical College

ఖమ్మం ప్రభుత్వ వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి సర్వం సిద్ధం అయింది. పాత కలెక్టరేట్, రోడ్డు భవనాల శాఖ కార్యాలయం కలుపుకొని 8 ఎకరాల్లో వైద్య కళాశాల ఏర్పాట్లు పూర్తయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య, ఆర్థిక శాఖల మంత్రి తన్నీరు హరీష్ రావు వైద్య కళాశాలను ప్రారంభించనున్నారు. కాళోజీ నారాయణరావు హెల్త్‌ యూనివర్సిటీ ఆధ్వర్యంలో 2023-24 విద్యా సంవత్సరం నుంచి నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ చట్టం ప్రకారం అనుమతి లభించిన దరిమిలా తరగతుల నిర్వహణకు సిద్దంగా ఉంది.

ఈ విద్యా సంవత్సరం నుండి 100 సీట్లతో తరగతులు ప్రారంభం కానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ పూర్తయింది.పాత కలెక్టరేట్ భవనాన్ని రెన్నోవేషన్ చేపట్టి, రూ. 8.5 కోట్లతో పరిపాలన, లైబ్రరీ, పరీక్షలు, టీచింగ్ హాళ్లు గా, పాత పౌరసరఫరాల కార్యాలయం, ఇవిఎం గోడౌన్ ను మ్యూజియం, బయో కెమిస్ట్రీ, క్లినికల్ ఫిజియాలజీ, హేమటాలజీ, అంఫిబియా ల్యాబ్ లు, డిసిక్షన్ హాల్, లెక్చర్ హాళ్లు, పాత గిరిజనాభివృద్ది అధికారి కార్యాలయంలో బయో కెమిస్ట్రీ, అనాటమి శాఖల అధికారులు, సిబ్బంది కార్యాలయం, పాత రోడ్డు భవనాల శాఖ కార్యాలయంలో బాలికల హాస్టళ్లుగా తీర్చిదిద్దారు.

ల్యాబ్ లకు సంబంధించి పరికరాలు, కళాశాలకు సంబంధించి ఫర్నీచర్, కంప్యూటర్ సామాగ్రి అంతా ఏర్పాటు పూర్తయింది. అంతర్గత రహదారుల నిర్మాణం పూర్తయింది. ప్రభుత్వ వైద్య కళాశాలకు ప్రభుత్వం 6 గురు ప్రొఫెసర్లు, 5 గురు అసోసిసియేట్ ప్రొఫెసర్లు, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లను కేటాయించగా, వారందరూ విధులందు రిపోర్ట్ చేశారు. ఇప్పటికే కళాశాల నిర్మాణం కొరకు రాష్ట్ర ప్రభుత్వం సుమారు రూ.166కోట్లను మంజూరు చేసింది.

ఇప్పటికే ఖమ్మం ఆసుపత్రిలో ఉన్న అధునాతన పరికరాలు, సౌకర్యాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లాతో పాటు పొరుగున ఉన్న మహబూబాబాద్‌, సూర్యాపేట, ఆంధ్రప్రదేశ్ లోని సరిహద్దు జిల్లాల నుంచి కూడా వైద్యం కోసం రోగులు వస్తున్నారు. దీంతో ఖమ్మం మెరుగైన వైద్యానికి కేంద్రంగా ఇప్పటికే గుర్తింపు పొందింది, వైద్య కళాశాల ప్రారంభం కానున్న నేపథ్యంలో రానున్న రోజుల్లో ఖమ్మం వైద్య రంగానికి హబ్ గా నిలువనుంది.

Related posts

గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిద్దాం

Bhavani

ఖమ్మం టౌన్ ఏసీపీగా పీవీ గణేష్

Murali Krishna

కలెక్టర్ కు వి ఆర్ ఓ పై గ్రామస్తుల ఫిర్యాదు

Bhavani

Leave a Comment