40.2 C
Hyderabad
April 28, 2024 17: 50 PM
Slider హైదరాబాద్

గణతంత్ర వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలి

#ambedkar

గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని కరెన్సీపై అంబేద్కర్ ఫోటో సాధన సమితి (సి ఏ పీ ఎస్ ఎస్) జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరుశురామ్ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ చంద్రయ్య ను కోరారు. హైదరాబాద్ లోని మానవ హక్కుల కమిషన్ కార్యాలయంలో ఆయన కలసి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా సీఏపీఏస్ఏస్ జాతీయ అధ్యక్షులు జేరిపోతుల పరశురామ్ మాట్లాడుతూ అంబేద్కర్ లేకుంటే భారత రాజ్యాంగం లేదని అన్నారు. రెండు సంవత్సరాల 11 నెలల 18 రోజులు నిద్రలేని రోజులు గడిపి భారత రాజ్యాంగాన్ని రాసి మన దేశానికి కానుకగా ఇచ్చారని అన్నారు. 1950 జనవరి 26న తొలి గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నామని, కానీ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టడం లేదని అన్నారు. అందుకోసమే ప్రభుత్వం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో అంబేద్కర్ చిత్రపటాన్ని పెట్టాలని ప్రత్యేక జీవోను తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ ఉపాధ్యక్షులు బొల్లి స్వామి, జోగు మురళి, కొమ్మగళ్ళ మచ్చగిరి, గుర్కు ప్రశాంత్, గూగుల కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

ఏపిలో చెత్త రోడ్లను వీడియోతో సహా చూపించిన సిపిఐ నారాయణ

Satyam NEWS

ప్ర‌జా స‌మ‌స్య‌లు వెలుగులోకి తేవ‌డంలో మెట్రో టీవీ విజ‌యం

Sub Editor

ప్రత్యేక హోదా ఇస్తేనే బిహార్‌లో అభివృద్ధి

Bhavani

Leave a Comment