గుజరాత్ లోని సర్దారువల్లాభాయ్ పటేల్ విగ్రహంలా 100 అడుగుల అంబేద్కర్ విగ్రహన్ని ముంబై నగరంలోని ఇందూ మిల్లు ఆవరణలో ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే వెల్లడించారు. బుధవారం జరిగిన మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. గతంలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసినా ఎలాంటి పనులు చేపట్టలేదు. అంబేద్కర్ మెమోరియల్ చైతన్యా భూమి సమీపంలో ఈ విగ్రహం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని ఠాక్రే వివరించారు.
previous post