ఏపీ రాజధాని అమరావతి కోసం రైతులు చేస్తున్న ఆందోళనలు నేడు 30వ రోజుకు చేరాయి. పండుగ రోజు కూడా రాజధాని రైతులు పోరు కొనసాగిస్తున్నారు. మందడం, తుళ్లూరు వెలగపూడిలో రైతులు నిరాహారదీక్షలు కూడా చేస్తున్నారు. రైతులు రాజధానిని పరిరక్షించుకునేందుకు పండగ రోజు పస్తులు ఉండాలని నిర్ణయించుకున్నారు. రైతులు, మహిళలు బుదవారం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉపవాసం చేశారు. రాజధాని రైతులు వెలగపూడి, కృష్ణాయపాలెంలో 30వ రోజు రైతులు రిలే దీక్షలు చేయనున్నారు. నవులూరు, నిడమర్రు, ఎర్రబాలెం ఇతర రాజధాని గ్రామాల్లో రైతుల నిరసనలు కొనసాగనున్నాయి.
previous post