సంక్రాంతి సంబురాలు మూడో రోజైన కనుమ నాడు కూడా కొనసాగుతున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలో ప్రజలు ఉత్సాహంగా పండుగ కార్యక్రమాలలో పాల్గొనారు. హైదరాబాద్ శిల్పారామంలో ఏర్పాటు చేసిన సంక్రాంతి సంబురాలకు విశేషంగా జనం తరలి వచ్చారు. నగర శివార్లలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన పతంగుల పండుగ కూడా ఉత్సాహంగా సాగింది.
సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యుడు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇంట్లో సందడి నెలకొన్నది. ఆయన నివాసం లో కుటుంబసభ్యులతో కలసి గాలిపటాలు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో డీ.ఎస్.ఆర్.యువసేన సభ్యులు మధుసాగర్, ప్రవీణ్ రెడ్డి తదితరులు ఉత్సాహంగా పాల్గొన్నారు.