40.2 C
Hyderabad
April 26, 2024 12: 56 PM
Slider ప్రపంచం

సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న ఆటా

Aata-1

అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ గా భువనేశ్ బుజాల పదవి బాధ్యతలు స్వీకరించారు. వాషింగ్టన్ డీసీ నివాసి అయినా భువనేశ్ గారు 2004 సంవత్సరం నుంచి ఆటాలో ఉత్సాహంగా పాలుపంచుకొన్నారు. 2014 లో జరిగిన ఫిలడెల్ఫియా కన్వెన్షన్లో కోఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించిన భువనేశ్ నాశ్విల్లే నగరంలో జనవరి 16 న జరిగిన అట కార్యవర్గ సమావేశంలో ప్రెసిడెంట్ పదవి అధిరోహించారు.

డిసెంబర్ లో హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో ఆటా బోర్డు అఫ్ ట్రస్టీస్ గా జయంత్ చల్ల, కాశీ విశ్వనాధ్ కొత్త, పరశురాం పిన్నపురెడ్డి, శారద సింగిరెడ్డి, సోమశేఖర్ నల్ల, తిరుపతి రెడ్డి ఎర్రంరెడ్డి, హను తిరుమల రెడ్డి, ప్రశీల్ గూకంటి, రఘువీర్ రెడ్డి. రామ్ అన్నాది, రవీందర్ గూడూరు, రిండా సామ, శరత్ వేముల, సుధీర్ బండారు & విజయభాస్కర్ తుపల్లి ఎన్నికయ్యారు.

ఆటా ప్రెసిడెంట్ గా భువనేశ్ బుజాల, సెక్రటరీ గా హరిప్రసాద్ రెడ్డి లింగాల, ట్రేషరేర్ గా సాయినాథ్ రెడ్డి బోయపల్లి, జాయింట్ సెక్రటరీ గా రామకృష్ణ రెడ్డి ఆలా, జాయింట్ ట్రేషరేర్ గా విజయ్ కుందూరు ఎన్నిక అయ్యారు. నష్విల్లె నగరంలో జరిగిన ఆటా బోర్డు మీటింగ్ లో నూతన కార్యవర్గం పదవి బాధ్యతలు స్వీకరించింది. తదుపరి ప్రెసిడెంట్ గా మధు బొమ్మినేని ఎన్నిక అయ్యారు.

ప్రెసిడెంట్ భువనేశ్ తన ప్రాధాన్యతలు వివరించారు. ఆటా ఎమర్జెన్సీ సర్వీసెస్ అమెరికా సంయుక్త రాష్ట్రాల లోని ప్రతి రాష్ట్రానికి విస్తరిస్తున్నామని వివరించారు. ఆపదలో ఉన్న తెలుగు వారు ATA సేవ 1-844-ATA-SEVA టోల్ ఫ్రీ నెంబర్ కి కాల్ చెయ్యవలిసిందిగా విజ్ఞప్తి చేసారు. ATA-ఫౌండేషన్ ద్వారా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో సేవ కార్యక్రమాలు నిర్వహించబోతున్నామని ఆయన స్పష్టం చేశారు.

అమెరికాలో తెలుగు సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించడానికి ఆటా ఎల్లప్పుడూపెద్ద పీఠ వేస్తుందన్నారు. మన మాతృభూమిలో సేవ కార్యక్రమాలు నిర్వహించాలనుకునే ప్రవాసులు ఆటాను సంప్రదించవలసిందిగా కోరారు. సంస్థ నిర్వహణ కార్యక్రమలో అమెరికాలో పుట్టి పెరిగిన మన పిల్లలను భాగస్వాములు చెయ్యటానికి తగు సూచనలు సలహాలు ఇవ్వవలిసింది బోర్డుని కోరారు. యూత్ కమిటీ ఏర్పాటు చేసారు. మొట్ట మొదట సారిగా ATA కన్వెన్షన్ అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీ నగరంలో 2022 సంవత్సరంలో జులై 1-3 తారీకులలో నిర్వహిస్తున్నామని అందరూ తప్పక పాలుపంచుకోవాలిసిందిగా కోరారు.

కోవిద్ సమయంలో సహాయక చర్యలు, సంస్థ బాధ్యతలు ఎంతో సమర్ధవంతంగా నిర్వహించి పదవి విరమణ చేసిన పరమేష్ భీంరెడ్డికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచేసారు. ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించిన రవి పట్లోళ్లకి, ప్రీవియస్ ప్రెసిడెంట్ కరుణాకర్ ఆసిరెడ్డిని బోర్డు అభినంచింది. నాశ్విల్లే నగరంలో ఆతిధ్యం ఇచ్చిన ఆటా సబ్యులకు పేరు పేరున కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ఆటాకి తోడ్పాటు అందిస్తున్న లోకల్ ఆర్గనైజషన్స్ ను బోర్డు కొనియాడింది.

బూజాలా భువనేష్ రెడ్డి వనపార్తి జిల్లాలోని గుమ్మాడమ్ గ్రామానికి చెందిన వ్యవసాయ కుటుంబానికి చెందినవాడు (గతంలో మహాబుబ్‌నగర్); గుమ్మదాం జెడ్‌పి హైస్కూల్‌లో 10 వ తరగతి వరకు చదివి, తరువాత పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు కోసం మహాబుబ్‌నగర్‌కు వెళ్లి, ఆపై జెఎన్‌టియు నుండి సివిల్ ఇంజనీరింగ్‌లో బిటెక్ చదివి, 1992 లో యుఎస్‌ఎకు ఉన్నత చదువుల కోసం వెళ్లారు. అతను 1994 లో NYIT నుండి కంప్యూటర్ సైన్స్ లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశాడు.

1996లో తానే ఓ ఐటి సంస్థన్ని స్థాపించారు. ఈ విధంగా భారతదేశం నుండి చాలా మంది ఐటి నిపుణులు ఉద్యోగం కోసం యుఎస్ఎకు రావడానికి సహాయపడ్డారు. 1998 నుండి వర్జీనియాలో నివసం ఉంటూ… మన భారతీయ కమ్యూనిటిలకు ఎల్లప్పుడు మద్దతును అందించారు. 2006 నుండి అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ATA) లో యాక్టివ్ మరియు అనేక పదవులలో పనిచేశారు మరియు చివరికి 2021 జనవరి 16 శనివారం ATA అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఇది జనవరి 2023 వరకు 2 సంవత్సరాల కాలపరిమితి. భువనేష్ తన పదవీకాలంలో సాధ్యమైనంతవరకు ATA ఫౌండేషన్ కార్యకలాపాల ద్వారా మా తల్లి భూమికి సహాయం చేయాలనుకుంటున్నారు. 17వ ATA సమావేశం వాషింగ్టన్ DC లో జూలై 1-3, 2022 లో అతని పదవీకాలంలో జరుగుతుంది.

Related posts

పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు పెంచాలి

Satyam NEWS

అంబేద్కర్ ఇంటిపై దాడిని ఖండించిన ఎల్లేని

Satyam NEWS

నేడు ఎలోన్ మస్క్ 51వ పుట్టిన రోజు

Satyam NEWS

Leave a Comment