42.2 C
Hyderabad
May 3, 2024 17: 43 PM
Slider నిజామాబాద్

ఆకౌంట్లో పడ్డ డబ్బులు వాపసు పోవు

Pocharam 191

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలకేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు పోచారం చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అఫ్రాన్ దుస్తువులను బాన్సువాడ నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి పోచారం సురేందర్ రెడ్డి ఆదివారం పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ బాన్సువాడ నియోజకవర్గంలో పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్ని గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులు కరోనావైరస్ నివరణకై అనునిత్యం సేలందిస్తున్నందుకు పోచారం ట్రస్ట్ ఆధ్వర్యంలో అందరికి ఆఫ్రాన్ దుస్తువులను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు.

అదేవిధంగా బాన్సువాడ మున్సిపాలిటీ వారికి బుమ్ స్ప్రే మిషన్ అందజేసినట్లు తెలిపారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున రాష్ట్రంలో లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో ప్రజలకు టీఆరెస్ ప్రభుత్వం ఒక్కొక్కరికి ఉచితంగా12 కిలోల బియ్యం,ఒక తెల్ల రేషన్ కార్డుకు1500 రూపాయల చొప్పున నగదు ఇచ్చిందని అన్నారు.

ఈ నగదును రేషన్ కార్డు దారుల ఆకౌంట్లో వేసిందని,ఆ డబ్బులు వాపసు  పోవని,ప్రజలు తొందర పడకుండా ప్రభుత్వం ఇచ్చే 1500 రూపాయలు నిదానంగా తిసుకోవలని కరోనా కు దూరంగా ఉండాలని దయచేసి ప్రాణాల మీదికి చెచుకోవద్దని సూచించారు.

డబ్బులు వాపసు పోతాయనే పుకార్లు నమ్మవద్దని, ఎవరో చెప్పిన మాటలు విని కరోనా కోరల్లో చిక్కుకోవద్దని అన్నారు. లాక్ డౌన్ సందర్భంగా ప్రజలు ఇంట్లో ఉండి పోలీసులకు, ప్రభుత్వానికి సహకరించాలని  సురేందర్ రెడ్డి  చేతులెత్తి మొక్కుతూ విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సభ్యుడు శంకర్ పటేల్, మండల టీఆరెస్ అధ్యక్షుడు ఎజాస్ ఖాన్, స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాస్,ఏఎంసీ డైరెక్టర్ నజీర్, నాయకులు అనిల్ కులకర్ణి, అర్షద్, బీర్కూర్ గంగాధర్, సాయిలుతదితరులు పాల్గొన్నారు.

Related posts

గంటలోపే ఆభరణాల దొంగల్ని పట్టుకున్న పోలీసులు

Bhavani

ఎంపి మాధవ్ పై పరువు నష్టం దావా వేస్తున్న రాధాకృష్ణ

Satyam NEWS

ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ పై బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఫైర్

Satyam NEWS

Leave a Comment