30.7 C
Hyderabad
April 29, 2024 06: 32 AM
Slider నిజామాబాద్

కరోనాను ఆపాలంటే సామాజిక దూరాన్ని పాటించండి

sanitizer

ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ను నిర్ములించేందుకు ప్రతి ఒక్కరూ మనిషి మనిషికి మధ్య సామాజిక దూరాన్ని పాటించాలని సీఐటీయూ జుక్కల్ నియోజకవర్గ కన్వినర్ సురేష్ గొండ అన్నారు.

ఆదివారం మద్నూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో పారిశుధ్య కార్మికులకు, ఆశ కార్యకర్తలకు, అంగన్వాడీ టీచర్ లకు, పంచాయతీ సిబ్బందికి తహసీల్దార్ కిష్ట్యా నాయక్, ఎంపీడీవో సాయి శ్రీ, ఎస్సై సురేష్, సర్పంచ్ డి. సూర్యకాంత్ ల చేతుల మీదుగా మాస్కులు, డెటాల్, బట్టల సబ్బులను పంపిణీ చేశారు.

పంపిణీ కార్యక్రమానికి ముందు పారిశుధ్య కార్మికులు తాము చేస్తున్న రోజు వారి పనులలో ముందుగా పరిశుభ్రత పాటించాలని రెండు చేతులు ఎత్తి వేడుకున్నారు.

ప్రస్తుత కరోనా వైరస్ నేపథ్యంలో గ్రామంలో పారిశుధ్యం పరిసరాల పరిశుభ్రత ఉండేందుకు ప్రధాన కారణం పారిశుధ్య కార్మికులే కీలకమని అలాంటి కార్మికుల కుటుంబాలకు వైరస్ వ్యాపించకుండా ఉండేందుకు గాను తీసుకోవలసిన జాగ్రత్తలు సూచిస్తు సీఐటీయూ ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరికి మాస్కులు, డెటాల్ బట్టల సబ్బులను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ముందుకు వచ్చి పంపిణీ చేయడం పట్ల చాలా సంతోషాన్ని కలిగించిందని సురేష్ గొండ అన్నారు.

మద్నూర్ మండల కేంద్రంలో పని చేస్తున్న ఆశ కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్ లందరు ఇతర ప్రాంతాల నుండి వచ్చే వారిపై ప్రత్యేక ద్రుష్టి పెట్టి అలాంటి వారిపై అప్రమత్తంగా ఉంటూ సంబంధిత మండల స్థాయి అధికారులకు సమాచారం అందించాలని పక్క రాష్ట్రం మహారాష్ట్రలో కరోనా వైరస్ రోజు రోజుకు తీవ్రమవుతుండడంతో ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని ఎస్సై సురేష్ సూచించారు.

లాక్ డౌన్ కారణంగా ప్రజలందరూ ఇండ్లలో ఉండేలా కృషి చేస్తున్న ఎస్సై, తహసీల్దార్, ఎంపీడీవో, వైద్య, అంగన్వాడీ, ఆశ కార్యకర్తల పట్ల సీఐటీయూ ప్రత్యేకంగా అభినందించింది. కరోనా మహమ్మారి ఎవరి నుండి ఎటువైపుగా వ్యాపిస్తుందో తెలియదని కోవీడ్ -19 ను కట్టడి చేసే క్రమంలో ప్రతి ఒక్కరు తప్పని సరిగా మాస్కులు ధరిస్తూ శానిటైసర్ వాడుతూ ముఖ్యంగా పారిశుధ్య కార్మికులు రోజుకు 20 సార్లు తమ చేతులను శుభ్రం చేసుకోవడం వల్ల వైరస్ వ్యాపించకుండా జాగ్రత్త తీసుకోవచ్చన్నారు.

ఈ కార్యక్రమం లో గ్రామ పంచాయతీ కార్యదర్శి నర్సయ్య, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బాలు, అంగన్వాడీ మద్నూర్ ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్షురాలు చంప బాయి, పారిశుధ్య కార్మిక సంఘ అధ్యక్షురాలు స్వరూప, కార్యదర్శి రమేష్, ఆశ కార్యకర్తలు మహానంద, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

Related posts

సుస్థిర అభివృద్ధి కోసం అన్ని శాఖల సమన్వయం

Satyam NEWS

ఎంపీ ఆదాల సమక్షంలో 40 మంది పార్టీలో చేరిక

Bhavani

30,453 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ ఉత్తర్వులు

Sub Editor 2

Leave a Comment