38.2 C
Hyderabad
May 2, 2024 20: 04 PM
Slider మహబూబ్ నగర్

మూసి ఉన్న స్కూలుకు ముఖ్యఅతిధి

#Anaconda

కరోనా కారణంగా చాలా కాలంగా స్కూళ్లు మూసి ఉన్నాయి. పిల్లలు రాకపోతేనేం నేను వస్తాను అంటూ ఒక కొండ చిలువ స్కూలుకు వచ్చేసింది.

అది చక్కగా చదువుకునేదేమో కానీ దాన్ని చూసి గ్రామస్తులు భయపడ్డారు. స్కూల్లో కొండ చిలువ ఉందని అందరికి చెప్పేశారు.

గ్రామస్తుల్లో ధైర్యవంతులు డిప్యూటీ సర్పంచ్ నాయకత్వంలో  ఆ కొండ చిలువను చంపకుండా జాగ్రత్తగా పట్టుకుని అటవీ శాఖ అధికారులకు అప్పగించారు.

ఈ సంఘటన నాగర్ కర్నూల్ జిల్లా పరిధిలోని అమ్రాబాద్ మండలం, దోమలపెంట గ్రామంలో జరిగింది. ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఉన్న ఆ కొండ చిలువను పట్టి అచ్చంపేట డీఏప్ఓ కు అప్పచెప్పారు.

ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ ఆఫీసర్ మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొనుగోలు కేంద్రాల నిర్వహణ

Satyam NEWS

పిడిఎస్ యు ఖమ్మం జిల్లా అధ్యక్షుడుగా ఆజాద్

Murali Krishna

కాలనీ సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు

Bhavani

Leave a Comment